👉 నిరుద్యోగులకు రు.4000 భృతి చెల్లిస్తాం..
👉 క్వింటాల్ మద్దతు ధర పై అదనంగా ₹ 500 ఇస్తాం..
👉 అన్ని రకాల పెన్షన్లు ₹ 4000లకు పెంచుతాం…
👉 ఆడబిడ్డలకు ₹ 500 లకే సిలిండర్ అందిస్తాం.
.
👉 అట్టడుగు వర్గాల కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి దేవాంశ సంభూతుడు!
👉 పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
J.SURENDER KUMAR,
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజ శేఖర రెడ్డి జయంతినీ యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి హాజరయ్యారు. వై ఎస్ రాజ శేఖర రెడ్డి
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
👉దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ శేఖర్ రెడ్డి
సమాజంలోని నిరుపేద అభివృద్ధి నిరంతరం అలోచించారు. రాజశేఖర్ రెడ్డి దైవాంశసంభూతుడు. ఎన్నికల మేనిఫెస్టో లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి సీఎం గా రాజశేఖర్ రెడ్డి మొదటి సంతకం పెట్టారు.
ప్రపంచంలో రైతుల్లో భరోసా కల్పించేందుకు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ అందించినది వై ఎస్ ఆర్ ఒక్కరే..
👉తప్పా లేదు..తాలు లేదు..రవాణా చార్జీలు లేకుండా కళ్లం కాడ వడ్లు తూకం వేసే పద్దతి ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి ది.
👉రైతులను రుణ విముక్తి చేయాలని ఏక కాలం లో రుణ మాఫీ చేసి, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ₹ 5000 ప్రోత్సాహకం అందించారు..
👉ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించారు.
👉ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోవడంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
👉వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన108 సకాలంలో వచ్చి గర్భిణీ నీ ఆస్పత్రికి తీసుకెళ్తోంది..
👉చదువు ఆర్థిక భారం కావొద్దని, అందరికీ సమాన విద్యనందించాలని ఆంగ్ల మాద్యమం సక్సెస్ స్కూల్ ప్రారంభించారు.
👉ప్రజల అవసరాలు గుర్తించి, సేవలు అందించారు.
👉సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి ది.
👉అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెట్టారు.
👉నేత కార్మికులకు పెన్షన్ ఇచ్చినట్టుగా గీతా కార్మికులకు కూడా పెన్షన్ అమలు చేశారు.
👉చేపల పై ఆధారపడి జీవించే వారికి చెరువుల పై హక్కులు కల్పించింది కాంగ్రెస్.
👉గీతా కార్మికులకు వేలం పద్దతి రద్దు చేశాము.
ఇళ్లు లేని నిరుపేద వర్గాలకు,
ఇళ్లు మంజూరు చేసినం.ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం లేదు..
👉భూమి సేకరించి, ఇళ్లు నిర్మించి ఇచ్చాం. కులాలకు, పార్టీలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇళ్లు మంజూరు చేపట్టినం.
👉నేడు ప్రతి సంచికి రెండు కిలోలు, క్వింటాల్ కు 5 కిలోలు కోత విధిస్తున్నారు.ఎకరానికి ప్రతి రైతు ₹ 2,000 నష్ట పోతున్నారు.
👉నేడు అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే పథకాలు అందడం లేదు అని విమర్శించారు..
తొమ్మిదేళ్ళ లో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని అన్నారు..
👉అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ₹5 లక్షలు ఇళ్ల నిర్మానం కోసం ఇస్తామన్నారు.
👉ఛత్తీస్ ఘడ్ లో వరికి మద్దతు ధర పై అదనంగా ₹ 500 ఇస్తున్నామని.. తెలంగాణలో కూడా ప్రతి క్వింటాల్ పై మద్దతు ధర పై అదనంగా ₹.500 ఇస్తాం..దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకోవడం బాధ్యత..
రైతు భీమా భూమి ఉన్నోల్లకే ఇస్తున్నారు..
భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇవ్వడం లేదు.
👉కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు అందరికీ ₹ 5 లక్షల భీమా కల్పిస్తాం..
👉సమాజంలోని నిరుపేద వర్గాలకు ₹.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం..
👉రాష్ట్ర విభజన తో కాంగ్రెస్ పార్టీ నష్టపోతది అని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారు.
👉మిగులు రాష్ట్రం గా ఏర్పడిన తెలంగాణ ₹.5లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి నెట్టబడింది.
👉శాతవాహన యూనివర్సిటీ,నాచుపల్లి జేన్టీయు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్సే.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, పిసిసి సభ్యులు గిరి నాగ భూషణం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జున్ను రాజేందర్, నాయకులు తాటిపర్తి రాంచంద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షుడు తీపిరెడ్డి బాపురెడ్డి,
సొసైటీ డైరెక్టర్ రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొప్పెర వెంకటరెడ్డి, నల్ల స్వామి రెడ్డి, మాతులాపురం మహేష్, నక్క రవీందర్ బండారి స్వామి షేక్ హబీబ్, మునిందర్ రెడ్డి, మారు గంగారెడ్డి, సర్పంచ్ నిషాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, మున్నా, కాంగ్రెస్ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు న్ హాల్, హాబీద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, కచ్చు హరీష్, గోపీ రావు, గంటా వేణు రావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
