కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే మొదటగా చేసేది 24 గంటల విద్యుత్‌ కోత విధిస్తుంది!

మంత్రి కొప్పుల ఈశ్వర్..

J.SURENDER KUMAR,

ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ నీ గెలిపిస్తే ఆ పార్టీ మొదట చేసేది 24 గంటల విద్యుత్ కోత విధిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా బుధవారం ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం లోని రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గ పాల్గొన్నారు
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని, ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.
పాము కాట్లకో, మిత్తీల పాట్లకో తన ప్రాంత రైతుబిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతుంటే.. వారిని ఎట్లా బతికించుకోవాల్నా అని మథనపడిన కేసీఆర్‌ మదిలోంచి పుట్టిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకం. అన్నారు.
రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని మంత్రి ప్రశ్నించారు.
నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు.


ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు….
ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలే.. దాని వెనుక సీఎం కేసీఆర్‌ పడ్డ కష్టం ఎంతో ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుందనేది అక్షరాలా సత్యం తెలంగాణ రైతులు తమ పంటలు సాగు చేసుకునేందుకు.. అదృష్టాన్ని, వరుణదేవున్ని నమ్ముకొనేవారు.
ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. అలా మార్చడానికి ఉపయోగపడ్డది 24 గంటల నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తు.
దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. తెలంగాణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించిన సమయం. ఇంతటి ఘన విజయం వెనుక.. సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్ష, పట్టుదల, మార్గదర్శనం, పక్కా ప్రణాళికలు దాగి ఉన్నాయి.
2017 జూలై 16న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో, జూలై 18న నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో విద్యుత్తు సరఫరాను ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ను బొందపెడితేనే రైతాంగం అంతా బాగుపడుతుంది రైతులను కష్టపెట్టిన వారు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు
దమ్ముంటే రైతులకు మూడు గంటల కరెంటు ప్రతిపాదనను మ్యానిఫెస్టో లో పెట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగేందుకు రావాలి.
24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉందాం మంత్రి పిలుపునిచ్చారు