కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానానికి తిలోదకాలు జగిత్యాల మున్సిపల్ లో ఇష్టారాజ్యం !

కలెక్టర్ కు కౌన్సిలర్ ఫిర్యాదు..


J.SURENDER KUMAR

జగిత్యాల మున్సిపల్ మే 31న 2023 జరిగిన సాధారణ సమావేశంలో ఎజెండా అంశం నెం ” 31 ” ద్వారా హారితాహారం కోఆర్డినేటర్ గా బొచ్చు బాలశేఖర్ నియామకం వద్దని చేసిన ఏకగ్రీవ తీర్మానంకు విరుద్ధంగా తిరిగి అతడినే నియమించారు, అంటూ ,35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


సాధారణ సమావేశంలో 40,000/- రూ,, జీతంగా ఎజెండాలో పొందు పర్చగా కౌన్సిల్ సభ్యులము 20,000 /- రూ జీతం చొప్పున ఇద్దరిని (2) తీసుకొండి. ఇతను వద్దు అని ఏకగ్రీవ తీర్మాణం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 47 మంది కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్ల ఏకగ్రీవ తీర్మాణ ను పెండింగ్ లో పెట్టి తిరిగి జూన్ మాసం సమావేశానికి ‘మే’ మినిట్స్ ఇవ్వకుండా కౌన్సిల్ కు తెలియకుండా నియామకానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ యంత్రాంగంపై చర్యలు తీసుకొని. ఇద్దరు నిరుద్యోగ యువకులను నియామకం కు ఉత్తర్వులు గారి చేయాల్సిందిగా ఫిర్యాదులో కౌన్సిలర్ పేర్కొన్నారు.