డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు దరఖాస్తు చేసుకోండి – ఆగస్టు 5 చివరి తేదీ!

జగిత్యాల జిల్లా కలెక్టర్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణంలోని గృహం లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందుటకు అర్హులైన ప్రజల నుండి మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుండి ఆగస్టు 5, 2023 వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

రేషన్ కార్డు, ఆధార్, ఆదాయం, కులం సర్టిఫికెట్లతో పాటు జగిత్యాల నివాసి అయిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకొనని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.