ధర్మపురి లో  గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ !

ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం..


J.SURENDER KUMAR,

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు
గురువారం  ధర్మపురిలోని గోదావరి నది ప్రవాహాన్ని,  అక్కపల్లి చెరువు నీటి మట్టాన్ని మంత్రి  పరిశీలించారు.

కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని వివరించారు. గోదావరి ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తుండటం తో రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రంగం తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.   చెగ్యాం గ్రామంలో ముందస్తుగా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.


గోదావరి ప్రవహాన్ని పరిశీలినలో, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న,  డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యో రాజేష్, మున్సిపల్ కమిషనర్  ఉన్నారు

న్యాయవాది కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

ధర్మపురి పట్టణం కాశిట్టివాడకు చెందిన న్యాయవాది సత్యనారాయణ, కుటుంబ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ఓదార్చారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి చెందారు.

ధర్మపురి మండల బీఆర్ఎస్ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ నియామకం


ధర్మపురి మండల బీఆర్ఎస్ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ నీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నియమించారు.. మండల బీఆర్ ఎస్ అధికార ప్రతినిధి గా ఓడనాల మల్లేశం నియమించబడ్డారు. మండల  కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా గ్రామాలవారీగా 40 మందినీ నియమించినట్టు ప్రకటించారు.