J. SURENDER KUMAR,
ప్రభుత్వ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి గల ఈశాన్య గణపతి ఆలయంలో గురువారం ‘ సంకటహర చతుర్థి ‘ పూజలు ఘనంగా జరిగాయి. ఉపనిషత్తులతో అబిషేకం, హరతి, మంత్రపుష్పం, కార్యక్రమలను వేద పండితులు నిర్వహించారు.

పూజాది కార్యక్రమాలలో దేవస్థానం వేదపండితులు పాలెపు ప్రవీణ్ శర్మ , ముత్యాల శర్మ , స్థానిక వేదపండితులు మధురామ శర్మ , అర్చకులు విశ్వనాథ శర్మ , నంభి ఆరుణ్ కుమార్ , సాయికుమార్ , రెనవేషన్ కమిటి సభ్యులు , సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.