J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిగా చిపిరిచెట్టి రాజేష్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా, 519 ఓట్లు పోలయ్యాయి . రాజేష్ కు 208 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు రాజేష్ గెలిచినట్టు ప్రకటించారు.

ఏకగ్రీవమైన కార్యవర్గం!
ప్రధాన కార్యదర్శిగా బండారు లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సోమిశెట్టి శివ సాయి, స్తంభం గాడి మహేష్, ఆర్థిక కార్యదర్శి కాశెట్టి రాంబాబు, సంయుక్త కార్యదర్శులుగా ఓడ్నాల భూమేష్, పానుగంటి రవి, కార్యదర్శులుగా చల్ల రవి, బండారు తిరుపతి, చుక్క రవి, చుక్క భీమరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ఎన్నికల అధికారులుగా చెరుకు రాజన్న ,సంగీ నరసయ్య, బండి మురళి వ్యవహరించారు.