👉కడెం ప్రాజెక్టు తీరుపైనే కల్లోలం…
👉సంతోషిమాత ఆలయ మెట్ల పైకి గోదావరి వరద!
J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్ర గోదావరి తీరప్రాంత వాసులు భయం భయంగా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు.. కడెం ప్రాజెక్టు తీరుపై తీరవాసుల కల్లోలం చెందుతున్నారు. ఎడతెరిపి లేని వర్షం. ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, ఎగువ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భయాందోళనకు ప్రధాన కారణం.

స్థానిక రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బుధవారం సాయంత్రం నుంచి నది తీరంలో గస్తీ కాస్తూ భక్తులను ,స్థానికులను, చేపల వేటకు వెళ్లే వారిని అడ్డుకుంటూ వెనక్కి పంపిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇళ్లలోని , వ్యాపార సముదాయాల లోని వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగం, అభ్యర్థించడంతోపాటు, ఆదేశిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటల వరకు ఎస్సారెస్పీ నీటిని గోదావరి నదిలోకి విడుదల చేయనట్టు సమాచారం.

ఆ నీరు చేరితే ధర్మపురిలో తెలుగు కళాశాల , వాసవి నిత్యాన్న సత్రం, తదితర ప్రాంతాల వరకు వరద వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ధర్మపురి జగిత్యాల్ వెళ్లే దారి ఆకు సాయి పల్లె వద్ద లో లెవెల్ వంతెన మునిగి పోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టు ఏ క్షణం ఏమవుతుందోనని ధర్మపురి వాసులు భయాందోళన చెందుతున్నారు.