ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !
J.SURENDER KUMAR.
నోడల్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళ వారం రోజున ఐడిఒసి లోని తన ఛాంబర్ లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నోడల్ అధికారులు ప్రాథమిక సమాచారం తెలిసి ఉండాలని అన్నారు. జిల్లాలో మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, రవాణా, కంప్యూటరీకరణ, సైబర్ సెక్యూరిటీ, ఐటి, స్వీప్, శాంతి భద్రతలు సెక్యూరిటీ, ఈవిఎం మేనేజ్మెంట్, ఎంసిసి, ఖర్చుల మానిటరింగ్, బ్యాలెట్ ,పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యునికేషన్ ప్లాన్, ఎలక్ట్రోరోల్, ఫిర్యాదులు, ఓటరు హెల్ప్ లైన్, పరిశీలకులుగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. దశల వారీగా నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సమిష్టి సహకారంతో నిర్వహించాలని అన్నారు. ప్రతీ నోడల్ అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుగుణంగా, నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత, వివిధ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.