J.SURENDER KUMAR
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉర్దూ భాషలో అవగాహన కల్పించాలని జగిత్యాల కు చెందిన యువకుడు శుక్రవారం కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలపై తెలంగాణ రాష్ట్ర రెండవ భాష అయిన ఉర్దూను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే అవగాహన కల్పిస్తున్నారని, ఉర్దూ భాషలో కూడా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఇస్లాంపూరకు చెందిన మహమ్మద్ జమీల్ అనే యువకుడు కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో. పేర్కొన్నారు
భారత ఎన్నికల అధికారులు ఉర్దూ భాషను మర్చిపోవడం చాలా బాధకరమని, ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలలో తెలుగు, ఇంగ్లీషు భాషలను ఉపయోగించి ప్రచారం చేస్తున్నట్లు ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేయకుండా ఉర్దూ భాషలో కూడా అవగాహన చేయాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నడు