J.SURENDER KUMAR,
గ్రామీణ ప్రజల దేవత పొచమ్మ అని ఎందరో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి గురుకులంలో ఉంటారని, వీరందరి కి గ్రామదేవతను గుర్తుచేసి విద్యార్థుల విశ్వాసాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రిన్సిపాల్ మమత అన్నారు.
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మ బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ప్రపంచ మానవాళి క్షేమాన్ని కోరుతూ ప్రిన్సిపల్ మమత నెత్తిన బోనాలను ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. పోచమ్మ బోనాల కార్యక్రమం లక్ష్మీపూర్ గ్రామస్తులను ఆకట్టుకొంది. గ్రామ పోచమ్మ కు గురుకులం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమముతో గురుకుల విద్యా సంస్థ గ్రామ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్నారన్న భావన స్థానికుల్లో నెలకొంది. ఈ కార్యక్రమంలో గురుకుల టీచర్స్ తోపాటు విద్యార్థినిలు, సిబ్బంది ఉన్నారు.
సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో.

జగిత్యాల పట్టణంలో సిద్ధార్థ విద్యా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాసం బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నుండి విద్యార్థులు, బోనాలతో ర్యాలీగా స్థానిక గాజుల పోచమ్మ వరకు వెళ్లి పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు పోతురాజు వేషాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలా చేస్తుంటామని పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్స్ బి. శ్రీధర్ రావు, బి. హరిచరణ్ రావు, బి. రజిత , బి. అజిత, జే. మౌనిక, కె. కిషన్, జే. రాజు లతోపాటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.