ఇంటి కే వెళ్లి  సహాయ చెక్కును అందించిన – ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం సహాయ నిధి చెక్కును బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి అందించడంతో ఆ కుటుంబ సభ్యులు హర్షతిరేకం వ్యక్తం చేశారు.

పట్టణంలో 19వ వార్డుకు చెందిన పద్మావతి కి న సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ₹1 లక్ష 25 వేల రూపాయల విలువగల చెక్కును వారి ఇంటికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వెళ్లి వారికి అందజేశారు.ఎమ్మెల్యేకి  పద్మావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఎమ్మెల్యే  వెంట కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, నాయకులు రంగు మహేష్ గౌడ్, రామకృష్ణ రెడ్డి, మహేందర్ రావు, తదితరులు ఉన్నారు.
పట్టణ,అర్బన్ మండలానికి చెందిన 7 గురు లబ్దిదారులకు సీఎం సహయనిది ద్వారా మంజూరైన ₹ 3 లక్షల రూపాయల చెక్కులను  ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పంపిణీ చేశారు.


నిరుపేదలకు  ఉచిత కంటి ఆపరేషన్లు


జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కు చెందిన 15 మంది నిరుపేదలకు  ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దుమాల రాజ్ కుమార్, రంగు మహేష్, అర్వపల్లి శ్రీనివాస్, ఎలుమాద్రి కిషోర్,  డా.విజయ్,  నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.