జగిత్యాల మున్సిపల్ ఎజెండా అంశాలు  రద్దు చేయండి !

కలెక్టర్ కు కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు !

J.SURENDER KUMAR.

బుధవారం జరిగిన జగిత్యాల్ మున్సిపల్ సాధారణ సమావేశంలో ని అవకతవకల ఎజెండా  అంశాలు రద్దుచేసి,అవకతవకలకు బాధ్యులైన  అధికారులపై చర్యలు చేపట్టాలని 35 వార్డ్  కౌన్సిలర్ అనుమల జయశ్రీ కలెక్టర్ కు  ఫిర్యాదు చేశారు.


ఫిర్యాదు పత్రంలో వివరాలిలా ఉన్నాయి.


👉 డీజిల్ బిల్లుకు సంబంధించి ప్రతినెల 1 To 30 రోజులకు ఇవ్వాల్సింది పోయి కేవలం 15 రోజులకు సంబంధించి ఒక్కనెల ఇస్తూ మరొక నెలకు ఇవ్వకుండా కౌన్సిల్ను తప్పుదోవ పట్టించడం జరిగింది. కొత్త కౌన్సిల్ కొలువుదీరిన నాటి నుండి డీజిల్ ఖర్చు ఎక్కువైన సందర్భంలో అప్పుడున్న కలెక్టర్  ధరఖాస్తులు ఇవ్వగా అప్పుడున్న అధికారి ఆరుణశ్రీ  పూర్తి స్దాయి విచారణ జరిపి తరువాత వచ్చిన మకరంద  సిస్టమ్ చేంజ్ చేసి ఎంప్లాయ్లను మార్చి బంక్ చేంజ్ చేసిన సందర్భంలో ₹ 12,00,000/-, పైన వచ్చే బిల్లు ₹ 8,00, 000/- పైన వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. కాని ఈ కొత్త కమీషనర్ వచ్చిన మళ్ళీ ఈ డిజిల్ బిల్లు దరిదాపుగా ₹ 11,00,000/- లక్షల రూపాయలకు తీసుకువచ్చారు  విచారణ జరిపించండి.
👉 డీజిల్ బిల్లు
( 16-05-2023  to  31-05-2023 ) 4,83, 540/- ( 01-06-2023  to 19-06-2023) 6, 11, 826/- టోటల్  బిల్లు ₹ 10,95,366/-
👉 . కంటి వెలుగు ప్రోగ్రాం సెంటర్ల ఎలక్ట్రికల్ రిపేర్లు ₹0/0 96,060/- పై అంశానికి కౌన్సిల్ అప్రువల్ లేకుండా కలెక్టర్ గారి అప్రూవల్ లేకుండా చెల్లించారు.


👉 సానిటేషన్ వెహికల్ రిపేర్ (2,2638+40626+57651) = 1,20,915.0 ప్రతినెల వెహికల్ రిపేర్ల పేర్ల మీద కొన్ని లక్షల రూ ఖర్చు చూపుతున్నారు. వీటికి సంబంధించి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు ఎంత ఖర్చు అయింది అనే వివరాలు కావాలని నేను మార్చి 2023 లో, కమీషనర్ గార్కీ దర – ఖాస్తు ఇస్తే 4 మాసాలైనా సమాచారం ఇప్పటికీ ఇవ్వలేదు చాల సార్లు కమీషనర్ గారికి మరియు సంబందిత సెక్షన్ అధికారి బాల యేల్లం గారిని అడిగిన వివరాలు ఇవ్వటం లేదు.
👉  సి.సి.రోడ్లు మరియు సి.సి డ్రైన్లకు సంబంధించి గత కమీషనర్లు బిల్లు ఇవ్వని బిల్లులు  కమీషనర్  చెల్లించారు . దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మనవి.
👉  స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ 60 నెం. లేబర్ ఎంగేజ్  3,24,500/- ఈ పని అసలు చేయలేదు. ఈ పని చేసినట్లు ఎటువంటి ఆదారాలు లేవు. సంధింత సానిటేషన్ అధికారి బాల ఎల్లం  అడిగితే నేను చేపించలేదు.
👉  File No 1841/C/MCJ| 2023 :- మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కు 67,500/- రూ 19,కేసులకు ఇక్కడ కేసులకు కౌంటర్ వేసారు. కాని దాదాపు సం,, పూర్తవుతున్న కేసు ముందుకు పోకుండా స్కూటిని వద్ద ఆగిపోయి ఉన్నాయి.
👉 Flie No. 2050/C1/ MCJ/2023:- 2023-24 సం॥ నకు స్టేషనరి కొరకు 5.00 లక్షలకు పరిపాలన మంజురు కొరకు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ కౌన్సిల్ను తప్పుదోవ పట్టించి స్టేషనరీగా చూపుతూ కొంత మంది ఉద్యోగులు వారి స్వంత ప్రయోజనాల కొరకు కోనుగోలు చెసుకొని మున్సిపల్ రికార్డ్ లలో చూపుతున్నారు.
👉.  ఫైల్ No. C1/268/Mcj/2022-23: – పిబ్రవరి-2021 నుండి జూలై, 2022 వరకు హిమదార ప్యూరిఫైడ్, జగిత్యాల వారికి నుండి సప్లై చేసిన దాని బిల్లు 39,089/- ఈ అంశం 30-11-2022 గత కౌన్సిల్ సమావేశాలలో రావడం. జరిగింది అప్పుడున్న కమీషనర్ స్వరూపరాణి మేడమ్ ఇందులో అవకతవకలు ఉన్నాయని ఫైలుపై సంతకం చేయలేదు తిరిగి మరోసారి ఎజెండాకు తెచ్చిన ఈ అంశాన్ని రద్దు చేయాలి.
👉 File NOC/268/2023: – తేది.15-01-2021 నుండి 11-08-2021 వరకు బాలాజీ బుక్ డిపో జగిత్యాల గారి స్టేషనరి ₹1.68.828/- చెల్లించాలని కాని ఇది కూడ పాత ఎజెండాలలో కూడ రావడం జరిగింది. మరియు అప్పుడున్న కమీషనర్  స్వరూప రాణి  ఫైలుపై సంతకం చేయలేదు ఎందుకంటే అందులో పూర్తి సమాచారం లేదు అని అవకతవకలు జరిగాయని బిల్లు చెల్లించని అంశాన్ని మళ్ళీ తిరిగి ఈ ఎజెండాలో పొందు పర్చడం జరిగింది.
👉 ఫైల్ No.G.1 /McJ/2045 12023:- ఇక్కడ మున్సిపాలిటి వారు కొత్తగా ఏ మున్సిపాలిటి వారు కూడ ఉద్యోగులకు డీజిల్ పోసిన దాఖాలాలు లేవు. కాని మన మున్సిపాలిటి వారు జనరల్ ఫండ్ ను ప్రజా అవసరాలకు మౌలిక సదుపాయాలకు వాడాల్సిన మొత్తాన్ని అధికార పక్షం వారు అధికారం ఉంది కదా అని వర్క్, ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు మరియు ఇప్పుడు చైన్ మెన్లుకు ప్రతినెలా 15 లీటర్ల పెట్రోలుకు అనుమతిని ఇస్తూ ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో బడుగు అశోక్ పర్మినెంట్ ఉద్యోగి ఇతనికి జీతం వస్తుంది. మిగతా వారందరికి కూడు మున్సిపల్ జీతంతో పాటు అదనంగా పెట్రోలు 15 లీటర్లు ఇది రాజ్యాంగ విరుద్ద చర్య కావున ఈ అంశాలన్నీ రద్దు పరచాలని మనవి.


👉 అంశం నెం:-
13,14,15 లకు సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద `టెంట్లు, కుర్చీలు మొదలైన వాటిని వేసినట్లు బిల్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడ కౌన్సిల్ అప్రూవల్ లేదు మరియు కలెక్టర్ గారిఅప్రూవల్ లేదు కేవలం అదనపు కలెక్టర్ మౌఖిక ఆదేశాలు అని చెప్పుతున్నారు. కాని అప్పుడున్ని అదనపు కలెక్టర్గా J. అరుణశ్రీ  అడిగితే నేను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని తెల్పటం జరిగింది. ఇక్కడ దాదాపు ₹ 2.00 లక్షల పైన బిల్లు ఇచ్చినారు. అప్పుడున్ని కమీషనర్  బిల్లు చెల్లించలేదు అందులో వాస్తవాలు లేవు మరియు ఆధారాలు  లేవు కావున వెంటనే వీటిని రద్దు పరుచవలసిందిగా మనవి.
👉 .File No: 1748/Mcj/E1/DB /20d 23: – 14th Finanee నిదులైన హౌజింగ్ బోర్డులో Lp.No. 43/2000 వద్ద అభివృద్ధి చేయుటకు రూ,, 50.00 లక్షలకు కౌన్సిల్ తీర్మాణం  22, తేది.19/06/ 2020 రోజున ఆమోదం పొందిన పనిని కలెక్టర్  మౌఖిక ఆదేశాలతో డబుల్ బెడ్రుల వద్ద కరెంటు సౌఖర్యం కొరకు మార్పు చేయుటకు పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్ ఆమోదం చేయరాదని దీనికి పైనుండి ఉత్తర్వులు తీసుకోవాలని మాకు తెలిసిన సమాచారం దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని మా మనవి.
👉  File no. 1747/Mcj/E1/DB/2023:-
పట్టణ ప్రగతి ద్వారా వార్డు నెం.1 యందు CC డ్రైన్ నిర్మాణం కొరకు 50.00 లక్షల రూ ,,2020 లో టెండర్ అయిన పనిని స్థల వివాదం వల్ల ఆ పనిని రద్దు పరచాలని 31-05-2023 రోజున ఎజెండాలో పొందు పర్చారు. దానికి తీర్మానం నెం. 618. ప్రకారం రద్దు చేయబడ్డ పనిని తిరిగి 520 డబుల్ బెడ్రూంలకు కరెంటు కొరకు మార్పు చేయాలని తిరిగి ఈ మాసపు ఎజెండాలో పొందుపర్చారు. ఇది ఏవిధంగా సాధ్యమవుతుంది. దీనిపైన కుడా విచారణ జరిపి పూర్తి వివరాలు తెల్సుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని మా మనవి.
👉. File No: 2047/Mcj /E1/F1/15nthFC /2023 : –
15nth ఫైనాన్స్ నిధులతో చేపట్టి అభివృద్ది పనులలో అంశం నెం 2″ స్వీపింగ్ మిషన్ కొనుగోలు కొరకు 2 కోట్లరూ పెట్టినారు. కాని గతంలో 45 లక్షల రూా,, స్వీపింగ్ మిషన్ ను కోనుగోలు చేసి అది కేవలం దాదాపు 2 సం॥ లలో కేవలం 3 నుండి 4 నెలలు మాత్రమే రోడ్ మీద పని చేసింది దాని ఖర్చు చూస్తే రిపేర్లు పేరు మీద కొన్నిలక్షలు ఖర్చు చేసిన అది పూర్తి స్థాయి వినియోగంలోకి రావటం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టు కుని ఈ అంశాన్ని రద్దు పరున వలసిందిగా మనవి.
👉 సానిటేషన్ విభాగానికి Equipment Tools 5.00లక్షలు ప్రతి సం,, తీసుకుంటున్నట్లు చూపుతున్నారు కానీ లేబరకు ఇచ్చిన దాఖలాలు లేవు ఇకముందు ఇటువంటివి జరుగకుండా లేబర్ లకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా మనవి.
👉  బిన్స్ కొరకు 2.00 లక్షల రూ,, పెట్టినారు. కానీ, ఇక్కడ కుడా అదేపరిస్థితి.
👉  File No.1368/mcj/E, /MGF/2023:-
దశాబ్ది  ఉత్సవాల కోరకు  31-05-2023 ద్వారా ₹ 15 లక్షల ,, లకు మంజూరు ఇవ్వటం జరిగింది. కౌన్సిల్ ఇవి సరి పోలేదు అవి తిరగి మళ్ళీ ఇంకా అదనంగా ₹ 6,82,787/- లు కావాలి అని ఎండాలో ఇచ్చినారు. కాని 15లక్షల రూ॥ కూడ పూర్తి స్థాయి ఖర్చు జరుగలేదు. ఇక్కడ ప్రజాదనం గుర్వినియోగం చేసినారు అధికారులు పూర్తి వివరాలు తెప్పించి విచారణ జరపాలని మరియు ఈ అంశాన్నీరద్దు పరచాలని మా మనవి కౌన్సిల్ను తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మనవి.
👉. File .No. 1998/mcj/MGF/2023  :
కోవిడ్ సెకండ్  వేవ్ కు సంబంధించి మృతదేహలను తరలించడానికి పుప్పాల రాజేందర్ ప్రోపరేటర్ శివ అంబులెన్స్ సర్వీస్ వారు అంబులెన్స్ను అందించినట్లు చూపుతున్నారు. ఇక్కడ కూడ కేవలం చైర్మన్ మౌఖిక ఆదేశాలు చూపుతూ కౌన్సిల్ అప్రూవల్ లేదు. మరియు కలెక్టర్ గారి అప్రూవల్ లేదు, మరియు అప్పుడున్న కమీషనర్ స్వరూప రాణి గారు బిల్లు ఇవ్వలేదు అంటే ఎటువంటి ఆధారాలు లేవు కావున దిన్ని రద్దు పరుచవలసిందిగా మనవి మరియు కోవిడ్ కేవలం 3 మాసాలు అంటే 12-4- 2021 నుండి 12-7-2021 కి మాత్రమే ఉంది కానీ, ఇక్కడ 29-01-2022 వరకు మృతదేహలు తరలించినట్లు తెల్పుతున్నారు. అప్పుడు కోవిడ్ కూడ లేదు. గతంలో మున్సిపల్ లో అంబులెన్స్ Parking కొరకు స్థలం లేదని మున్సిపల్ లో పెట్టడం జరిగింది. అదికూడ ఇందులో పెట్టడం జరిగింది.
👉 . file No.1548/Mcj/F1 /2022 : వ్యాక్సినేషన్లో భాగంగా  జిల్లా కలెక్టర్  ఆదేశాలు తేదీ 17-09-2021 రోజున అయితే 17-12-2021 నుండి 22-12-2021 వరకు బోజన మరియు త్రాగునీటి వసతి చేసినట్లు చెప్పుతున్నారు. ఆదేశాలు 9 నెలలో ఇస్తే 12 నెలలో ఏర్పాటు చేసినట్లు తప్పుగా చూపారు. మరియు ఇక్కడ కేవలం 17-12-2021 నుండి 22-12-2021 వరకు అని చూపి బిల్లు 31-12-2021 వరకు ₹ 91,875/-  సామంతుల మెస్ వారికి బిల్లు చెల్లించాలని ఆమోదం కొరకు పెట్టారు. కానీ ఆ సమయంలో ఎక్కడ వ్యాక్సి నేషన్ ఏర్పాట్లు చేయలేదు.
👉  File No: F1 |1442] Mcj | 2022:
వ్యాక్సినేషన్ సమయంలో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద టెంట్లు కుర్చీల కొరకు కేవలం కొంత మంది ప్రయోజనాల కొరకు ఎటువంటి టెండర్ లేకుండా కొటేషన్ లేకుండా వారికి ఇష్టం ఉన్న రీతిలో వారే ధరలు నిర్ణయించి వారికి ఇష్టమున్నరీతిలో రికార్డు చేయించి బిల్లు దాదాపు మొదట ₹ 24.00 లక్షలకు చేస్తే అప్పుడున్న కమీషనర్ ఇంత ఏవిధంగా అవుతుంది అని విచారణ చేస్తే మళ్ళీ వాళ్ళే దాన్ని తగ్గించి ₹12 లక్షలకు, తరువాత ₹10 లక్షలకు తిరిగి కాన్సిల్  కు ₹ 6,06,580/-  రూ,,కేవలం 1. CDMA గారి సర్క్యులర్ ప్రకారం  మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసినట్లు చెప్పుతున్నారు. అప్పుడున్న కలెక్టర్  కూడ దీనికి అప్రూవల్ ఇవ్వలేదు. కౌన్సిల్లో పొందుప్పున తరువాత మేము కలెక్టర్  దీని వివరాలు కరెక్ట్ అవునో కాదో తెలియాలంటే హెల్త్, డిపార్టుమెంటు మరియు మున్సిపల్ లో విచారణ జరిపితే పూర్తి వివరాలు తెలుస్తాయి అప్పుడున్న కమీషనర్ స్వరూపరాణి  దానికి విచారణ జరిపి అవకతవకలు జరిపారని పేర్కొన్న రు.
👉   F1/2052/Mcj/2023:-
జనన మరణ దృవీకరణ విభాగంకు ప్రింటర్ మరియు బీరువాలు కావాలని పెట్టారు, కాని గత మాసం జూన్లోనే టెండర్ ద్వారా కంప్యూటర్లు ప్రింటరు కొనుగోలు చేసారు. మరి ఏమైనట్లు? బీరువాలు పెట్టే స్థలమే లేదు.
👉  File No C1/268/2023 :
స్టేషనరీ ఖర్చు తేది 19-08-2021 నుండి 22-06-2012 వరకు బాలాజీ బుక్ డిపో జగిత్యాల ₹ 3,72, 9221- చెల్లించాలని ఈ ఎజెండాలో చూపారు. కాని 19-08-2021 నుండి 24-04-2022 వరకు అయిన బిల్లు ₹ 3,45,793/- జూన్ మాసంలో జరిగిన 27-06-2022 రోజున ఎజెండాలో కూడ చూపారు. తీర్మాణం చేసి బిల్లు చెల్లించారు. మరియు 22-05-2022 నుండి 22-07-2022 సంబంధించిన బిల్లు కూడ జూలై మాసం 2022 30/07/ 2022 రోజున ఎజెండాలో ఇవ్వటం జరిగింది బిల్ల- తీర్మాణం కూడ అయ్యింది. కాని, తిరిగి మళ్ళీ ఈ మాసం ఎజెండాలో తీర్మాణం కొరకు తీసుకురావటం కౌన్సిల్ను తప్పుదోవ పట్టించిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని మనవి.
👉 .ఫైల్No. 251 /Mcj/E1/2020 – 2020 సం,,లో జగిత్యాల పట్టణం లో హారతహారంలో బాగంగా చెట్లు నాటుటకు మరియు వేదురు . బొంగుల కోనుగోలు మూడు విడతలుగా చేసినట్లు చూపారు. ఇక్కడ కూడ కౌన్సిల్ ఆమోదం లేదు. కేవలం చైర్మన్, కమిషనర్ గారి ఆదేశాలుగా చూపారు. ఒక్కొక్క విడత ₹ 93,750 /- చొప్పున ₹ 2,81,250/-  ,,హరిని ఎంటర్ ప్రైజెస్ వారికి చెల్లించాలని, ఎటువంటి రికార్డులు లేవని చెప్పిన అధికారులు ఈ రికార్డు ఏరకంగా నమోదు చేసారో తెలియటం లేదు. జగిత్యాల మున్సిపాలిటిలో 2020- 2021 2021-22 కు సంబందించి హరిత హారం లెక్కలే అందుబాటులో లేవు. ఎన్ని సార్లు అడిగిన ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాని అప్పుడు ఎప్పుడో 2020 చేసిన పనికి బిల్లుకు మాత్రమే ఎజెండా లో పొందు పర్చివ ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుని దీన్ని రద్దు చేయాల్సిందిగా మనవి.
👉 .File No. 1268/ Mcj/E1/PR/Tractors/2022:
ట్రాక్టర్ ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ను ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్వయంగా డిపార్టుమెంట్ ద్వారా చేయకుండా కొటేషన్లు పిలిచి ₹ 93,000/-  క్యాదాసు నాగయ్య గారికి చెల్లించాలని పెట్టి ప్రజాదనం దుర్వినియోగం చేసినట్టు పలు ఆరోపణలు ఫిర్యాదు పత్రంలో  కౌన్సిలర్ హనుమండ్ల. జయశ్రీ పేర్కొన్నారు
.