👉 ఇద్దరు కమిషనర్ లు రద్దు చేసిన బిల్లు ఆమోదం కు కౌన్సిల్ సమావేశంలో ఎజెండా!
👉 కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆరోపణ
J.SURENDER KUMAR,
అవినీతి, అక్రమాలను గుర్తించి వ్యతిరేకించిన గత మున్సిపల్ కమీషనర్లు స్వరూపరాణి, గంగాధర్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి హయాంలో తిరస్కరించిన ₹ 30 లక్షల బిల్లుల ఆమోదం కోసం మున్సిపల్ సమావేశములో ఆమోదం కోసం పెట్టారని జగిత్యాల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపెల్లి దుర్గయ్య , నక్క జీవన్ కుమార్, ఆసియా సుల్తానా, ఫర్విన్ సుల్తానా , సహారా బాను పత్రికా ప్రకటనలో పలు ఆరోపణలు చేశారు.
ఎజెండాలోని ప్రతి అంశము ఎలాంటి పని జరుగకుండానే బిల్లులను అక్రమంగా కాజేయడానికి కొందరు అధికారపార్టీ సభ్యుల కొరకు ఈ ఎజెండాను ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ బిల్లులను ఇప్పుడున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సానిటేషన్ అధికారులు వారి హయాంలో పనులు జరుగకున్నా వారు సంతకాలు చేసి ఎజెండాకు తెచ్చి బిల్లులు ఏ విధంగా తయారు చేశారో ? ఏవిధంగా చెల్లింపులు చేస్తారో ? ఇంజనీరింగ్- అధికారులు వివరించాలని పేర్కొన్నారు.
జగిత్యాల మున్సిపల్ లో అవినీతి అక్రమాలు జరుగుతున్న మంత్రులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

కరోనా 2021లో వ్యాక్సిన్ సమయంలో పెట్టిన బిల్లు ₹ 6,06,580/-, ఇట్టి బిల్లు సంవత్సరం తరువాత తేది: 30-07-2022 రోజున సమావేశం నందు పొందుపర్చితే గౌరవ సభ్యులందరు వ్యతిరేకించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ సభ్యులు అట్టి బిల్లుల కొరకు ఒత్తిడి చేయగా గత మున్సిపల్ కమీషనర్లు లాంగ్ లీవు పెట్టినా వదలకపోయేసరికి చివరకు బదిలీపై వెళ్లినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
2021 మరియు 2022 సం॥లో బకాయి ఉన్నట్లు స్టేషనరీ బిల్లులు ₹ 1,68,828/- ₹ 3,72,922/- మొత్తం ₹ 5,41,750/-లు, తక్కువ స్టేషనరీ కొనుగోలు చేసి, బిల్లులను అధికంగా తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపించారు.
2021 కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలుగకుండా టెంట్లు, కుర్చీలు మొ॥ వాటి కొరకు ₹ 96,300/- ₹ 94,600/- మరియు ₹ 61,300/- ఇట్టి బిల్లులు నామమాత్రపు సామాగ్రి వేసి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటి రేట్లకన్నా అధికమొత్తంలో వేసి ప్రజధనాన్ని స్వాహా చేసేందుకు ఏజెండాల బిల్లుల ప్రవేశపెట్టారని పలు ఆరోపణలు చేస్తూ వారు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు