జగిత్యాల లోని ప్రభుత్వం డయాగ్నస్టిక్ కేంద్రంలో 57 నుండి 134 రకాల పాథాలజీ పరీక్షలు !

J.SURENDER KUMAR,

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రంలో 57 నుండి 134 రకాల పాథాలజీ పరీక్షలు అప్ గ్రేడేషన్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బాలింతలకు రక్త పరీక్షల రిపోర్టులు, న్యూట్రిషన్ కిట్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ , కలెక్టర్ యాస్మిన్ భాషా ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అందజేశారు. మాతా శిశు ఆసుపత్రిలో నేటి తో కంటి శస్త్ర చికిత్సలు ప్రారంభం కాగా, ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించి పరిశుభ్రత పాటించాలనీ సూచించారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మంద మకరందు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ , డిఎంహెచ్ ఓ శ్రీధర్, సూపరిందెంట్ రాములు , ఆర్ ఎం ఓ , వైద్యులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.