జనం గుండెల్లో వైయస్సార్ చిరస్థాయిగా  నిలిచి ఉన్నారు !

జగిత్యాల డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR,

ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ అన్నారు.
డాక్టర్ వై.ఎస్ రాజశేఖర రెడ్డి గారి 74 వ జయంతి సందర్భంగా శనివారం  ధర్మపురి పట్టణంలోని  నంది విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలవేసి

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించారని, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించిన ఘనత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ది రైతు రుణాలను మాఫీ చేసి ఎంతో మంది రైతుల కుటుంబాల్లో వెలుగు నింపిన మహనియమైన వ్యక్తి అని, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చిన స్వయంగా వారి దగ్గరికే వచ్చి చెప్పుకొనే పరిస్థితి అప్పుడు ఉండేదని లక్ష్మణ్ కుమార్ అన్నారు.  ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్  దగ్గరకు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వెళ్ళడానికి అవకాశం లేదని, రాజశేఖర రెడ్డి  తీసుకువచ్చిన పథకాలను ఆదర్శంగా తీసుకొని ఎన్నో రాష్ట్రాల్లో అమలుపరుస్తున్నారని  అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన భట్ల దినేష్, బ్లాక్ కాంగ్రెస్ 1 అధ్యక్షులు కుంట సుధాకర్, గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్,  మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, మండల బి. సీ సెల్ అధ్యక్షులు మల్లేష్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియోద్దిన్, టౌన్ యూత్ అద్యక్షుడు తిరుపతి, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యొరి మహేష్,సీపతి సత్తెన్న, అడ్వకేట్ జాజల రమేష్, రవి, లక్ష్మణ్, సుమక్, స్తంభం కాడి గణేష్,రాజ్ కుమార్, నిరంజన్, ప్రశాంత్,.నరేష్, భరత్, దేవవరం తదితరులు పాల్గొన్నారు.


ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల బి.సి సెల్  అధ్యక్షుల నియామకం!


జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్  నియమించారు.ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను అందజేశారు..
👉 ధర్మపురి మండల బి.సి సెల్ అధ్యక్షులుగా ముత్తినేని మల్లేశం.
👉 ధర్మపురి టౌన్ బి.సి సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్
👉 గొల్లపల్లి మండల బి.సి సెల్ అధ్యక్షులు క్యాస గంగాధర్
👉 బుగ్గారం మండల బి.సి సెల్ అధ్యక్షులు గాలిపెల్లి వెంకన్న
👉 ఎండపల్లి మండల బి.సి సెల్ అధ్యక్షులు బాలసాని మల్లేశం గౌడ్ లను నియమించారు..


ఈ సందర్భంగా నియోజకవ్గస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు..