జాతీయ, అంతర్జాతీయ కార్డియాలజీ కాన్ఫరెన్స్ విజయవంతం – డాక్టర్ శ్రీధర్ కస్తూరి !

👉 గుండె సంబంధ వ్యాధులు నియంత్రణ ఎలా ? ఆధునిక జాతీయ అంతర్జాతీయ వైద్య విధానం లో !


👉 హైదరాబాద్ లో మూడు రోజులపాటు జరిగిన కాన్ఫరెన్స్!

J.SURENDER KUMAR,

గత నెల జూన్ 30 నుంచి ఈ నెల 2 వరకు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ కార్డియాలజీ కాన్ఫరెన్స్ విజయవంతం అయిందని, సీఎస్ఐ, ఎస్ఐసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శ్రీధర్ కస్తూరి, టీఎస్ సీఎస్ఐ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ గార్గ్, తెలిపారు. మూడు రోజుల కాన్ఫరెన్స్ ను కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

జ్యోతి వెలిగించి కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


అంతర్జాతీయ కార్డియాలజీ కాన్ఫరెన్స్ నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ (ఎస్ఐసీ) 2023 కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎ స్ఐ) ఆధ్వర్యంలో జరిగిన కాన్ఫరెన్స్ లో జాతీయ, అంతర్జాతీయ కార్డియాలజిస్టులు. దాదాపు 3,000 మందికి పైగా పాల్గొన్నారని వారు వివరించారు
.

అంతర్జాతీయ గుండె వైద్య నిపుణులు


కార్డియాలజీ సంబంధిత చికిత్సలో, తాజా పురోగతిని కాన్ఫరెన్స్ లో సుదీర్ఘంగా చర్చించడంతోపాటు గుండె సంబంధ వ్యాధుల నియంత్రణ చర్యలు, సామాన్య ప్రజానీకం కు ముందస్తు వారిని చైతన్య పరచడం ఎలా ?

డాక్టర్ శ్రీధర్ కస్తూరి ప్రజెంటేషన్

సామాన్యుడికి అందుబాటులో ఆధునిక వైద్య సేవలు అందించడం. తదితర అంశాలపై జాతీయ అంతర్జాతీయ వైద్యులు పరస్పరం క్లిష్ట పరమైన కేసుల గూర్చి అధునాతన చికిత్స విధానాలపై ప్రదర్శనలతో పాటు ప్రసంగించారు.

అంతర్జాతీయ వైద్య నిపుణులు


కాన్ఫరెన్స్ లో 350 కేసులు ప్రదర్శించారు. 39 కేసులు చికిత్స ప్రత్యక్ష ప్రసారం, 800 మంది ఫ్యాకల్టీ, 75 కీనోట్ ప్రజెంటేషన్, 35 అంతర్జాతీయ ఫ్యాకల్టీస్, ప్రదర్శించినట్టు డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

అంతర్జాతీయ ప్రముఖ వైద్యుడు థామస్ అలెగ్జాండర్


కార్డియాలజీలో వచ్చిన మార్పులు, పురోగతిపై నిపుణుల ఆలోచనలను తదితర అంశాలను పరస్పర మార్పులకు ఈ వేదిక ఎంతో. ఉపయోగపడిందన్నారు

కార్డియాలజీకల్ లో వచ్చిన నూతన పద్ధతులు, తదితర అంశాలను వైద్యులు పరస్పర ఆలోచనలను.

ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు మ్యాథూస్

పంచుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో 40 లైవ్ కేసులు, నూతన వ్యాదులు, నూతన చికిత్స విధానాలు చర్చకు వచ్చాయని తెలిపారు.

సీఎ స్ఐ ట్రెజరర్ డాక్టర్ శ్రీధర్రెడ్డి పెద్ది, టీఎస్ సీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ వీఎస్ రామచంద్ర తదితరులు కాన్ఫరెన్స్ నిర్వహణ బాధ్యతలో కీలక పాత్ర నిర్వహించారు.