జర్నలిస్టులు నిర్దోషులు.. కేసు కొట్టివేత !

J.SURENDER KUMAR,

జర్నలిస్టులపై పెట్టిన కేసును జగిత్యాల జిల్లా అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జితేందర్ సోమవారం కొట్టి వేస్తూ తీర్పునిచ్చారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన మెజిస్ట్రేట్ సరియగు ఆధారాలు ప్రాసిక్యూషన్ సమర్పించక పోవడంతో కేసును కొట్టి వేస్తున్నట్టు తన తీర్పులో పేర్కొన్నారు.

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2012 మార్చి మాసంలో జరిగిన ఇంటర్ పరీక్షలలో నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల నిర్వహణ చేపడుతున్నారు అని పత్రికలలో, టీవీ ఛానల్ లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తల వల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని. పరీక్ష నిర్వాహకురాలు.( కాంట్రాక్టు లెక్చరర్ ) న్యాయస్థానం లో ప్రముఖ దినపత్రికల, టీవీ ఛానల్, ఎడిటర్లతో పాటు స్థానిక జర్నలిస్టుల గంగాధర్, శ్రీనివాస్, రవీందర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సురేందర్ కుమార్. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 11 సంవత్సరాల కాలం పాటు కేసు కొనసాగింది.
జర్నలిస్టుల పక్షాన ప్రముఖ న్యాయవాదులు దామోదర్ రావు, పవన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, రాకేష్ కన్న, వాదనలు వినిపించారు. సీనియర్ జర్నలిస్ట్ రంగారావు, జిల్లా జర్నలిస్టు సంఘ నాయకులు,(IJU). తదితరులు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.