జూలైలోనే ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి !

STU రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్


J.SURENDER KUMAR.

ఎన్నికల కోడ్ రాకముందే ప్రత్యేక చొరవతో జూలై లోనే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్టియుటిఎస్ జిల్లా అద్యక్షులు బైరం హరికిరణ్ అధ్యక్షతన ద్వితీయ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది.


ముఖ్యఅతిథిగా విచ్చేసిన సదానందం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని, ఉపాధ్యాయులను వేర్వేర్వేరుగా చూస్తోందని పాఠశాల విద్యారంగానికి ఉపాధ్యాయుడు కీలకమని అలాంటి ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమైతే మంచి సమాజాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు., డీఈవో , డిప్యూటీ ఇఓ, ఎంఈఓ , స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాల విద్యా రంగం ఉత్తమ ఫలితాలు ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు., ఎన్నికల కోడ్ వచ్చేలోపే నూతన పిఆర్సి ని నియమించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని , ప్రాధమిక పాఠశాలలకు ఎల్ ఎఫ్ ఎల్ పోస్టులు మంజూరు చేయాలని, ప్రతి పాఠశాలకు స్కవెంజర్ లను నియమించాలని, తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులలో విద్యా వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు., ఎస్ టి యు పూర్వ జిల్లా బాధ్యులు క్రియాశీల కార్యకర్త బ్రహ్మన్న గారి బ్రహ్మయ్య అకాల మరణం పట్ల సంతాపం ప్రకటించింది..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజోజీ భూమయ్య, కందుకూరి దయానంద్ ,
రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రవి ,రాష్ట్ర కార్యదర్శి కచ్చు రాజన్న, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్ రాష్ట్ర బాధ్యులు పోల్ రెడ్డి, కిషన్ , జిల్లా బాధ్యులు మురళి , కిరణ్, సత్యం, తడక రమేష్ , వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు
.