👉 జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో..
J. SURENDER KUMAR,
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది జగిత్యాల జిల్లా ధర్మపురి, జగిత్యాల్ అసెంబ్లీకి పోటీ చేయనున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులలో సిట్టింగ్ అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గత వారం రోజులు క్రితం 2024 ఎన్నికల నాకు చివరి ఎన్నికలు, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ ముందస్తుగా ఎన్నికల నినాదం మొదలుపెట్టారు. ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న అడ్ల్లురి లక్ష్మణ్ కుమార్, 2009 నుంచి 2018 వరకు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ( ఉప ఎన్నికలతో ) నేను ఓటమి చెందుతున్నాను, అయినా నియోజకవర్గ ప్రజల వెంట ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీనీ ప్రశ్నిస్తున్నాను. 2024 ఎన్నికల్లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అనే ఎన్నికల నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఒక్క ఛాన్స్ వెనక ..

దీనికి తోడు 2018 ఎన్నికల ఓట్ల లెక్కింపు లో అవకతవకలు జరిగాయి అంటూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు వెళ్లడం, స్ట్రాంగ్ రూమ్ తాళాలు గల్లంతు, కోర్టు పరిధిలో ఉన్న తదితర అంశాలు, తనకు జరిగిన అన్యాయం వివరాలను వివరిస్తూ, ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రచారం చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పోటీ చేసి గెలిచిన విషయాన్ని. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరిస్తూ 2018 లో తిరిగి పోటీ చేసినా ఆయన కు ఫలితం రాలేదని, తన ప్రచారంలో సంజయ్ వివరిస్తున్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ, 2018 ఎన్నికల్లోను ఇద్దరు, ముగ్గురు మినహా సిట్టింగ్ లకే తిరిగి పోటీ చేయడానికి బి ఫామ్ ఇచ్చిందనే విషయాన్ని ప్రచారంలో వివరిస్తున్నారు.
లాస్ట్ ఛాన్స్ వెనుక ?

2018 లో జిల్లాలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యే స్థానాలలో అధికార పార్టీ వారే విజయం సాధించారు. ఉన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్టీ అధిష్టానం నియమించింది. గత కొన్ని నెలలుగా రాజకీయ ఆధిపత్యం కోసం జిల్లాలో అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాల చర్చ కొనసాగుతున్నది. కొన్ని నెలలలోజరగనున్న ఎన్నికల్లో జగిత్యాల టికెట్ మహిళకు కేటాయిస్తారని, రాజకీయ గుసగుసలు మొదలయ్యాయి. దీనికి తోడు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ భోగ శ్రావణి, బిజెపి లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం జగిత్యాల అసెంబ్లీకి పోటీ చేయిస్తారనే చర్చ మొదలైంది. ఇదే అదనుగా బిజెపి అభ్యర్థిని కి దీటుగా అధికార పార్టీ నుంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ను. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో నిలుపుతారు అనే గుసగుస ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతున్నది. దీనికి తోడు ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ( ఎమ్మెల్సీ రమణ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి) ఎమ్మెల్సీ కవిత జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, క్యాంపు కార్యాలయానికి వెళ్లడం, కవితను వారు సన్మానించడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. ఇది ఇలా ఉండగా చైర్మన్ దావ వసంత. వివాద రహితరాలిగా, పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, హుందాగా రాజకీయ లో కొనసాగుతున్నారు అనే గుర్తింపు ఆమెకు ఉంది. దీనికి తోడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, చట్ట సభలలో మహిళల రిజర్వేషన్ బిల్లు అంశంపై ఢిల్లీలో ధర్నా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాల అసెంబ్లీకి అధికార పార్టీ అభ్యర్థిగా జెడ్పి చైర్మన్ వసంత అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ కవిత . బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కు సిఫారసు చేయనున్నట్టు చర్చ నెలకొంది.
మంత్రి కేటీఆర్ రాకతో సీన్ రివర్స్..?

బీఆర్ఎస్ పార్టీ, కార్యనిర్వహక అధ్యక్షుడు, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ రమణ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కొన్ని రోజుల క్రితం జగిత్యాల కు వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పై పలు ఆరోపణలు చేసిన విషయం విధితమే. తన ఇంటికి వచ్చిన మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆత్మీ యుల, కుటుంబ సభ్యుల సమక్షంలో, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, తన పర్యటనలు, పల్లె నిద్ర, వార్డుల సందర్శన, తదితర అంశాలను మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే సంజయ్ వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు టిక్కెట్ అంశంపై , రాజకీయ ఆధిపత్యం, పలు అభివృద్ధి పనులకు కొందరు ఆటంకాలు కల్పిస్తున్న అంశాలు మంత్రికి కేటీఆర్ కు వివరించినట్టు సమాచారం. దీంతోపాటు ఆయా సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల ఎమ్మెల్సీ ఎల్ రమణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఇన్చార్జి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్’ మైనారిటీ నాయకుల, సామాజిక నేపథ్యంను కెసిఆర్ కి వివరించినట్టు సమాచారం. ‘ మీరు నియోజకవర్గంలో మీ పనులు చేసుకోండి, పర్యటనలు చేసుకోండి, ఏది పట్టించుకోకండి, పూర్తి సర్వే సమాచారం అధిష్టానం వద్ద ఉంది ‘ అంటూ, మంత్రి కేటీఆర్, సంజయ్ కుమార్ కు హామీ ఇచ్చినట్టు చర్చ. దీంతో సంజయ్ కుమార్. 2024 ఎన్నికలు నా చివరి ఎన్నికలు, ఇదే ‘లాస్ట్ ఛాన్స్’ అనే నినాదం మొదలుపెట్టినట్టు సమాచారం. తాము గెలిస్తే ఇలాంటి అభివృద్ధి చేస్తా, అనే హామీలకు తిలోదకాలు ఇచ్చి. ‘లాస్ట్ ఛాన్స్’ ‘ఒక్క ఛాన్స్’ అనే ఎన్నికల నినాదంతో ఎలాంటి ఫలితాలు రానున్నవో వేచి చూడాల్సిందే.