డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖమ్మం సభలో పక్కకు నెట్టి వేశారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా ముందు మాట్లాడటం పద్ధతి కాదు అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుగ్గారం మండల కేంద్రంలో మంగళవారం లక్ష్మణ్ కుమార్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
👉 స్వయాన ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా ముందు డబ్బులకు కొనుగోలు విషయంలో ఉన్న ఎమ్మెల్యేను (రోహిత్ రెడ్డి) పక్కకు పెట్టుకొని ఒక మంత్రి హోదాలో ఉన్న కొప్పుల ఈశ్వర్ ను పక్కకు జరుగు అంటూ నెట్టి వేయడం జరిగింది..
👉 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని ఎంపిక చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గతంలో ఒక దళితుడిని ఒక ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
👉 సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజల కష్టాలు తెలుసుకుంటు సుమారు 13 వందల కిలమీటర్ల పాదయాత్ర చేస్తే రేవంత్ రెడ్డి తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీయే అభినందలు తెలియజేయడం జరిగింది.
👉 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన వారిలో చాలా వరకు దళిత వర్గానికే చెందిన వారే.. తెలంగాణ రాష్ట్రం వస్తె ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది.
👉 బుగ్గారం మండలంలో రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది తప్ప మండలం ఏర్పడిన తర్వాత మంత్రి హోదాలో ఉన్న కొప్పుల ఈశ్వర్ చేసింది ఏమి లేదు..
👉 ఒక నూతన మండలం ఏర్పడిన తర్వాత మండలంలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఉంటుంది. కానీ ప్రస్తుతం బుగ్గారం మండలం లో ఒక ఎమ్మార్వో ఆఫీస్ కి గాని, ఒక ఎంపీడీవో ఆఫీస్ కి గాని శాశ్వత కార్యాలయాలు లేవు..
👉 గంగాపుర్ గ్రామానికి రోడ్డు పనులకు సంబందించి శిలాఫలకాలు వెయ్యడం తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మండలంలో ఒక జూనియర్ కళాశాల గాని, ఒక ప్రభుత్వ హాస్టల్ గాని, బస్ స్టాండ్ గాని ఏర్పాటు చెయ్యలేదు..
👉 ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం తప్ప ఒక మంత్రి హోదాలో బుగ్గారం మండలానికి చేసిన ప్రగతి ఏమిటో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పాలి.
👉 ఇప్పటి వరకు చాలా మంది రైతులకు అమ్మిన ధాన్యం కి సంబందించిన డబ్బులు జమ కాలేదు, జమ అయిన వారి దాంట్లో చాలా వరకు కటింగ్ చేసి జమ చెయ్యడం జరిగింది.
👉 ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి బుగ్గారం మండల కేంద్రంలో శాశ్వత ప్రతిపాదికన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలి, లేకపోతే బుగ్గారం ప్రజలతో కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం..
ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన బట్ల దినేష్, నర్సగౌడ్, తిరుపతి, అంజిత్, శంకరయ్య, వెంకన్న,పెద్ద రామన్న, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు..