J.SURENDER KUMAR,
డీఎస్సీ 2003 ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు మంత్రి కెటిఆర్ కు PRTU -TS పక్షాన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
ఆదివారం జగిత్యాల కు విచ్చేసిన మంత్రి కెటిఆర్ కు 1/9/2004 కు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చి నియామక ప్రక్రియ మొదలయిన ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ ఇప్పించగలరని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి PRTU – TS రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు లు కోరారు.
మంత్రిని కలిసిన బృందంలో జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనంద్ రావు, సంఘ బాధ్యులు చిట్నేని విజయ్ కుమార్ , సంగ శ్రీధర్ , విజయ్ రావు, దేవేందర్, వేణు పాల్గొన్నారు