మైనార్టీల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

J.SURENDER KUMAR

మైనారిటీల సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ రూబీ ఫంక్షన్ హాల్ లో మైనార్టీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలు అమలు వివరించారు.

రాష్ట్రంలో 204 మైనార్టీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందించడం జరుగుతుంది. జిల్లా లో 5 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కాలేజీ ఉండగా 3200 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నారు.
మజీద్, షాది ఖానా, ఖబరాస్తాన్ ల అభివృద్ధికి ఉర్దూ ఘర్ ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, రియాజ్ మామ, రియాజ్ ఖాన్, అమీన్ ఉల్ హాసన్, నాసిరొద్దిన్ అక్తర్, హసీబొద్దిన్ , మొయినుద్దీన్అఫ్సర్, అసిఫ్, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.