మైనర్ వ్యక్తి వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమాని పై కేసు నమోదు చేస్తాం !

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !

J.SURENDER KUMAR.

మైనర్ లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ హెచ్చరించారు. వాహన యజమానులు మైనర్ వ్యక్తికి వాహనం ఇవ్వకూడదని, వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దానితో వారికి మరియు ఎదుటి వ్యక్తులకు ప్రమాదం జరగటం వల్ల రెండు కుటుంబాలు నష్ట పోతున్నాయని కావున మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగిన లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడిన వాహన యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించినారు

.గత రెండు రోజులు గా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్,విత్ ఔట్ నెంబర్ ప్లేట్, ట్రిపుల్ రైడింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వివిధ ప్రాంతాల్లో పటుబడ్డ 40 మంది వాహనదారులకు సోమవారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలింగ్ సెంటర్ లో వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో ఎస్పీ కౌన్సిలింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు పైకి వస్తుందని, యజమాని లేని కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని అన్నారు.
రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపిన, నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇకపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఓవర్ స్పీడ్/ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం/ రాంగ్ సైడ్ డ్రైవింగ్/సెల్ ఫోన్ డ్రైవింగ్/ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగిన ప్రమాదాల గురించి ఆడియో, వీడియో ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్ర కుమార్, రవీంద్ర రెడ్డి, RI నవీన్ ట్రాఫిక్ ఎస్.ఐ రాంచంద్రం,DRSB RSI కృష్ణ మరియ ట్రాఫిక్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.


పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి.!


సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో కోరుట్ల, మల్యాల సర్కిల్ పోలీస్ అధికారులతో ఎస్పి నెల వారి క్రైమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు .ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు.దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు.
ఈ సమావేశంలో డిఎస్పీ లు రవీంద్ర రెడ్డి, శ్రీనివాస్ సి.ఐ కోటేశ్వర్, ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ లు, DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.