బిజెపి గ్రాఫ్ పెరుగుతుందా ?
J.SURENDER KUMAR,
సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాకపోవడంతో బిజెపి గ్రాఫ్ పడిపోతుందని ఓ మాజీ ఎంపీ బహిరంగ వ్యాఖ్యానం నాడు. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఒంటెద్దు పోకడలతోనే, ఇతర పార్టీల నుంచి మన పార్టీలో చేరడానికి సంశయిస్తున్నారని, అందుకే బిజెపి పార్టీలో కి ఎవరు రావడం లేదని నేడు. ప్రధానంగా ఈ రెండు అంశాలతోనే ఆ పార్టీ లో ముసలం మొదలైందని చెప్పవచ్చు.
క్రమశిక్షణకు మారుపేరుగా, ప్రపంచలోనే అత్యధిక సభ్యులు గల రాజకీయ పార్టీగా, భారతీయ జనతా పార్టీ అంటూ ఆ పార్టీ నాయకులు, శ్రేణులు పలు సందర్భాల్లో ఊదరగొడుతున్న , ఊదరగొట్టిన,.ప్రసంగాలు, ప్రకటనలు జగమెరిగిన సత్యాలు. పార్టీ శ్రేణుల దిక్కార స్వరాలు, పార్టీ కేంద్ర అధిష్టానం కు ఫిర్యాదు చేసినట్లు లీకులు ఇవ్వడం, కర్ణాటక లో బిజెపి అధికార కోల్పోవడంతో మొదలైన ఎపిసోడ్.
ఎమ్మెల్సీ కవిత ను కేంద్ర సంస్థలు అరెస్టు చేస్తే నే రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరుగుతుంది అని ఆ పార్టీలో కొందరు లీడర్లు చేస్తున్న వ్యాఖ్యానాలు వారి వ్యక్తిగత రాజకీయ బలం, బలహీనతలు బహిర్గతం అవుతున్నాయి అనే చర్చ నెలకొంది.
ఇతర పార్టీలో నుంచి చేరిన ఈటెల రాజేందర్ కు కేంద్ర నాయకత్వం ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకని ? ఆ పార్టీలోనే ఓ వర్గం వారి అక్కసు ప్రచార సాధనలోనే అగుపిస్తున్నదే.
నాడు బిజెపి గ్రాఫ్ ఎలా పెరిగింది ? నలుగురు ఎంపీలు ఎలా గెలిచారా ?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన 119 అసెంబ్లీ సెగ్మెంట్లో డిపాజిట్ గల్లంతు కాగా, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచారు. కొన్ని నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ లు ఓటమి తో పాటు, సికింద్రాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు నలుగురు బిజెపి అభ్యర్థులు గెలుపుకు ఏ ప్రాతిపదికన బిజెపి గ్రాఫ్ పెరిగిందో ? నాలుగు ఎంపీ స్థానాలు పార్టీ ఖాతాలో ఎలా చేరాయో ? ముసలానికి మూలమైన కొందరు లీడర్లు, క్యాడర్ కు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ గెలుపులు ఎవరి ఖాతాలో నమోదు చేస్తారో, లీడర్లదా ? క్యాడర్ దా ? ఆ పార్టీ కేంద్రం నాయకత్వం దా ? అనే చర్చ మొదలైంది. దుబ్బాక అసెంబ్లీ గెలుపు, మునుగోడు నువ్వా? నేనా ? అనే తరహాలో స్వల్ప ఓట్ల మెజారితో బిజెపి ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల సంఖ్య, సంజయ్ నాయకత్వంలో ఏ సంఖ్య నుంచి ఏ సంఖ్య వరకు పెరిగిందో లీడర్లు క్యాడర్ కు వివరించ గలిగితేనే, వారి వెంట కేడర్ ఉండే అవకాశం ఉందని గ్రహించాలి.
కెసిఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉద్యమ నేతగా, గులాబీ జెండా ఓనర్ గా కొనసాగుతున్న ఈటల రాజేందర్ కు ఆ పార్టీలో జరిగిన అవమానం, బహిష్కరణతో ప్రత్యేక విమానంలో తన అనుచర గణాంతో ఢిల్లీకి వెళ్లి బిజెపిలో చేరడం ప్రత్యేకత తో పాటు, కమలం గుర్తుపై తిరిగి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాజేందర్ విజయం సాధించడం. ఓటమి కోసం అధికార పార్టీ కోట్లాది రూపాయల నిధులు హుజురాబాద్ లో ఖర్చు చేసినా, హుజురాబాద్ ఓటర్లు రాజేందర్ కే పట్టం కట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం, ఉద్యమ ప్రారంభం నుండి కెసిఆర్ వెంట ఉన్న ఈటలను బిజెపి పార్టీ కేంద్రా నాయకత్వం రాష్ట్రంలో పాగా వేయడానికి ఆయన సలహాలు, సూచనలతో పాటు ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత ఇదే పార్టీలో ఇతర సీనియర్ నాయకులుగా భ్రమలలో ఉన్న వారికి మింగుడు పడక, పార్టీలో ఆధిపత్య పోరుకు, వివాదాలకు కేరాఫ్ గా మారిందనే చర్చ.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కవిత అరెస్టు ప్రక్రియకు శ్రీకారం చుడుతారా ? పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరికలకు అధ్యక్షుడు బండి సంజయ్ నీ మారుస్తారా ? అనే అంశం రాష్ట్రంలో జులై 8న ప్రధాని మోడీ పర్యటన తరువాత స్పష్టత రావచ్చు.