J.SURENDER KUMAR,
ఇటీవల అనారోగ్యంతో మరణించిన కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ కుటుంబ సభ్యులను సోమవారం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలో పరామర్శించారు.

రమణ తండ్రి ఎల్ గంగారం (ఎల్ జీ రాం) చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చరు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్‌జీరాం హెల్త్‌కేర్ సొసైటీ ద్వారా ఎల్ గంగారం గారు పేద ప్రజలకు అనేక సేవలందించారని ఆమె అన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ ఇంటికి…

జగిత్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత జెడ్పీ క్యాంప్ కార్యాలయంకి వచ్చింది. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు కవిత ను సన్మానించారు. ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ కవిత ను కలిసిన జిల్లా దివ్యాంగుల నాయకులు!

తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి జగిత్యాల జిల్లా దివ్యాంగుల నాయకులు తీసుకువెళ్లగా వాటిపై చర్చించి సానుకూలంగా స్పందించారు., త్వరలో జిల్లా దివ్యాంగులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.,
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లంకదాసరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజ్గర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
