J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ ఎల్ రమణ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఆదివారం పరామర్శించారు.
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్ గంగారం (ఎల్ జీ రాం) ఇటీవల మృతి చెందారు. జగిత్యాల పట్టణంలో విరుపాక్షి గార్డెన్లో జరిగిన ఎల్ జి రామ్ సంస్మరణ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్, గ్రంధాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జెడ్పీటీసీ లు ,ఎంపీపీలు సర్పంచ్ లు ఎంపీటీసీ లు కౌన్సిలర్స్ లు నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు.