J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పుణ్య కార్యక్రమం అని, అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మంత్రి క్యాంపు కార్యక్రమంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 139 మంది లబ్ధిదారుల కు ₹ 45 లక్షల 94 వేల 500/- రూపాయలు విలువ గల చెక్కులను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.…
రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేని వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుంది. అన్నారు
ధర్మపురి నియోజకవర్గంలో ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం లో CMRF ద్వారా 27 వేల మందికి దాదాపు ₹ 69 కోట్ల రూపాయలు, LOC ద్వారా 381 మందికి ₹ 5 కోట్ల రూపాయల చెక్కుల ను మంజూరు చేయించడం. జరిగిందన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటాం

భారతీయ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలోని ఐదుగురు కార్యకర్తల ప్రమాదవశాత్తు చనిపోయారు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 10 లక్షలు మంజూరు అయ్యాయి అని చెప్పారు..
👉 ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన పసుల అనిల్, గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అతని భార్య పసుల అంజలి కి ₹ 2లక్షల చెక్కును మంత్రి అందించారు..
👉 తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుంటాల బీరయ్య, గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అక్క గట్టవ్వ కు ₹ 2 లక్షల చెక్కును అందజేశారు.
👉బుగ్గారం మండలానికి చెందిన కస్తూరి రవి, గత సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు చెరువు మునిగి చనిపోయారు వారి కుటుంబ సభ్యులకు ₹ 2 లక్షల చెక్కును అందజేశారు..
👉 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన కొండ సతీష్, గత సంవత్సరం ప్రమాదవశాత్తు చెరువు మునిగి చనిపోయారు భార్య రాణి కి ₹ 2 లక్షల చెక్కును అందజేశారు.
👉 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన గుజ్జేటి రవి, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు భార్య లక్ష్మి కు ₹ 2 లక్షల చెక్కును అందజేశారు..