నా మీద పోటీ కి ఎమ్మెల్సీ కవిత భయపడుతోంది ..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ !


J.SURENDER KUMAR,

నా మీద పోటీ చేయడానికి ఎమ్మెల్సీ కవిత భయపడుతుందని ,నా మీద పోటీ చేసే దమ్ము లేక మరొక అభ్యర్థిని బరిలో ఉంచి కవిత నన్ను ఓడిస్తుందట నిజాంబాద్ పార్లమెంటు సభ్యుడు ధరంపురి అరవింద్ ఆరోపించారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రం లోని తాహసిల్ చౌరస్తా లో బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ


👉 లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలు పాలయ్యిండు..ఆయనను చూసేందుకు ఇక కవితక్క పోతది..
👉 జీవన్ రెడ్డి నాకు తండ్రి తో సమానం జీవన్ రెడ్డి అంకులు అంటే నాకు ఇష్టమే కానీ కాంగ్రెస్ పని అయిపోయింది అంకల్ .
👉 పేద మహిళలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ తుగ్గలో తొక్కిండు.
👉 2020-21 లో పదివేల కోట్లు…21-22 లో 10,80 వేల కోట్లు బడ్జెట్ ప్రకటించి ఇండ్ల నిర్మాణం మాత్రం చేపట్టలేదు
👉 తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ముంచిండు..
👉 డబుల్ బెడ్ రూమ్ లో అవినీతి సొమ్ము, కాలేశ్వరం అవినీతి సొమ్ముతో మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేస్తున్న అవినీతిపరుడు కేసీఆర్
👉 కవిత 100 కోట్లు లిక్కర్ స్కాంలో కీలకం.
👉 కారు, చెయ్యి ,వద్దు బిజెపి కమలం పువ్వు ను గెలిపించాలి.


మహాధర్నా కార్యక్రమంలో, పటాన్ చెరువు మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్ ,జిల్లా బిజెపి అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు , మరియు జిల్లా బిజెపి నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు మహిళలతో కలిసి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు
.