ఘనంగా మంత్రి కొప్పుల వివాహ వేడుకలు!
J.SURENDER KUMAR.
మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు మంత్రి దంపతులకు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభతో స్వాగతించారు. అనంతరం ఆశీర్వచనం మండలం స్వామివారి ప్రసాదం శేష వస్త్రాన్ని మంత్రి దంపతులకు అందించి ఘనంగా ఆశీర్వదించారు.

బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నంది చౌరస్తా లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మంత్రి దంపతులు కేక్ కట్ చేశారు.

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో…
లయన్ కొప్పుల ఈశ్వర్ వివాహ దినోత్సవ సందర్భంగా స్థానిక లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ, తమలకుంట వద్ద స్కూల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు బుక్స్, స్లేట్ పెన్స్, మరియు పండ్లు పంపిణీ చేశారు .

మంత్రి లయన్ కొప్పుల ఈశ్వర్ , ధర్మపురి లోని లయన్స్ క్లబ్ నెంబర్ గా ఉండడంతో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించినట్టు అధ్యక్షులు లయన్ సాయిని సత్యనారాయణ తెలిపారు.

జాయింట్ సెక్రటరీ లయన్ శివకుమార్ పెద్ది, క్యాషియర్ లయన్ సిరుపతి రాజన్న , మరియు డిసి మెంబర్స్ లయన్ సంగి ఆనంద్ , లయన్ డాక్టర్ రామకృష్ణ, లయన్ పిన్న శ్రీనివాస్ లయన్ శ్రీహరి లయన్ డాక్టర్ రవి లయన్ సింహరాజు రమేష్ , సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.