నేషనల్ లెవెల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీకి జ్యోతి హై స్కూల్ విద్యార్థిని!

J.SURENDER KUMAR.

48 వ సబ్ జూనియర్ నేషనల్ లెవెల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కి జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ కి చెందిన 8వ తరగతి విద్యార్థిని T. సంజన, అర్హత సాధించింది.

తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపించి, పాండిచ్చేరి లో 03-08-2023 నుండి 09-08-2023 వరకు జరిగే
48 వ సబ్ జూనియర్ నేషనల్ లెవెల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించిందని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు తెలిపారు.
ఇందుకు గాను secundrabad లో గల YMCA లో ఈ నెల 24-07-2023 నుండి శిక్షణ శిబిరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతనిధ్యం వహిస్తున్న 19 మంది లో జగిత్యాల జిల్లా నుండి ఒక్కరే ఉండటం, జిల్లా కే గర్వ కారణం అని డైరెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యల హారి చరణ్ రావు విద్యార్థిని అభినందించారు., ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హారి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, విద్యార్థిని తండ్రి రవీందర్ రావు పాల్గోన్నారు