ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సారంగాపూర్ మం. పోతారం గ్రామంలో ₹1 కోటి 80 లక్షలతో నిర్మించిన 20 రెండు పడక గదుల గృహ సముదాయాన్ని శనివారం జగిత్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోతారం గ్రామానికి ఇప్పటివరకు ₹ 20 కోట్ల నిధులు అభివృద్ధి సంక్షేమ పథకాల కు మంజూరయ్యాయని అన్నారు.
అన్ని కుల సంఘాలకు నిదులు మంజూరు చేయటం జరిగింది. 86 మందికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 80 లక్షల రూపాయిలు .
63 మంది గొల్ల కురుమలకు గొర్ల యూనిట్లు మంజూరు అయ్యాయి అని.₹ 60 లక్షల నిదులు ఖర్చు చేయటం జరిగింది అని అన్నారు.
320 మంది కి ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.
₹5 కోట్ల 74 లక్షలు రూపాయలను పెన్షన్ ల ద్వారా ఇప్పటివరకు గ్రామానికి రావడం జరిగింది అని అన్నారు.

562 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా ₹4కోట్ల 80 లక్షలు రావడం జరిగిందని గుర్తు చేశారు. 109 మంది బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ ఇస్తున్న సర్కార్ తెలంగాణ సర్కార్..గతంలో తుతు మంత్రంగా పేదలకు ఇళ్ల పథకం అమలు చేశారని,కానీ ముఖ్యమంత్రి గారి నిరుపేదలు ఆత్మ గౌరవం తో జీవించే విడంగా డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి, సర్పంచ్ ఢిల్లీ రామారావు ఎంపిటిసి సుధాకర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ ఏలేటి నరసింహారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మదన్, నాయకులు ప్రేమనందం,లక్ష్మ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు మల్యాల జలపతి , సాయిలు, కొల నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ విజయరంగారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
