నిషేధిత గుడుంబా ను పూర్తి స్థాయిలో అరికట్టాలి ! అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్ ని నిరోధించాలి !

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !

J.SURENDER KUMAR,

జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ తో జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో గుడుంబా, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్ ని నిరోదించడానికి తీసుకోవాలసిన చర్యల పై పోలీస్, ఎక్సైజ్ అధికారుల తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ లో భాగంగా జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి గుడుంబా తయారు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే వారిని సంబంధిత తాసిల్దారుల ఎదుట బైండోవర్ చేయాలని సూచించారు. బెల్లం పటిక వంటి విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించాలని అన్నారు.

రాబోవు అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నద్ధంగా ఉండాలిని అన్నారు. జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్ పి‌ఎస్ పరిధిలల్లో ( స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ ) చెక్ పోస్టులకు ఏర్పాటులు చేయాలని, అక్రమంగా మద్యం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ అక్రమంగా జిల్లా లోకి రవాణా అయ్యేందుకు అవకాశముందని దీన్ని అడ్డుకోవడంలో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని ఆన్నారు. సుంకం చెల్లించని లిక్కర్ రవాణాను నిరోధించాలని అన్నారు. మీడియం, ప్రీమియర్ లిక్కర్ లు ఇతర రాష్ట్రాలనుండి తెలంగాణాకు అక్రమంగా తీసుకు వస్తున్నారని వీటిని అడ్డుకోవాలని తెలిపారు. ప్రధానంగా, ట్రాన్స్ పోర్ట్ , వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లిక్కర్ అడ్డుకోవడంలో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని ఆన్నారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాస్ , రాజశేఖర్ రాజు , ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రబాబు నాయక్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మరియు స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ లు పాల్గొన్నారు.