మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని తెలుగు కళాశాల లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) సెంటర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ఈ శిక్షణ కేంద్రం రావడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందవచ్చు,
గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు, వీరికి శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ కేంద్రంలో ఎలక్ట్రికల్, టైలరింగ్, మేషన్, ప్లంబర్, పెయింటింగ్ తదితర రంగాల్లో యువతీ యువకులకు మరియు, మహిళలకు మూడు నెలల టైలరింగ్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించి, శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థ నుంచి ఉచితంగా కుట్టు మిషన్లను అందించడం జరిగిందని మంత్రి అన్నారు
ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాల్సిందే, గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని సర్కారు గుర్తించి, ఇందులో భాగంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) ద్వారా నిరుపేద కుటుంబాల్లో అర్హులైన యువతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్యమైన శిక్షణ ను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు..
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు