న్యాయవాది సత్యనారాయణ మృతి! రాయపట్నం – కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో

ధర్మపురి లో విషాదం..


J.SURENDER KUMAR.

ధర్మపురి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది తిరుమందాస్ సత్యనారాయణ (49 ) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
న్యాయ సంబంధమైన పనుల నిమిత్తం న్యాయవాది ఈరోజు ఉదయం సొంత కారులో డ్రైవింగ్ చేసుకుంటూ కరీంనగర్ కు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ధర్మారం మండలం బంజరిపల్లి వద్ద ఎదురుగా కరీంనగర్ వైపు గొర్రెలతో వస్తున్న బొలెరో వాహనంను ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు వాహనాలు రోడ్డు కింది వైపుకు చేరాయి.

ఫోన్ చేసిన ప్రమాదం జరిగిన తీరు వివరించిన న్యాయవాది !

ప్రమాదం నుంచి బయటపడి 108 వాహనం ఎక్కడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాది.

ప్రమాదం జరిగిన వెంటనే తన సెల్ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి ఎవరితో నో మాట్లాడ తూ నాకు ఏమీ కాలేదు చూసుకో అంటూ ప్రత్యక్ష సాక్షి కథనం. తరువాత మరో కాల్ తన ఆప్తమిత్రుడు ధర్మపురి పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు గడిపల్లి సత్యనారాయణకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరు వివరించారు.’ నీకేం కాదు మేము వస్తున్నాం అంటూ’ బావ బండి మహేష్, తో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి తరలి వెళ్లారు.

ప్రమాద స్థలం.


ఎలా అనగా సంఘటనా స్థలంలో 108 వాహనం రాగానే న్యాయవాది సత్యనారాయణ, నడుచుకుంటూ వాహనంలో కూర్చున్నారు. కరీంనగర్ అపోలో ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

వివాదరహితుడు.

న్యాయవాది సత్యనారాయణ వివాద రహితుడిగా, సౌమ్యుడుగా, ఇద్దరు సంతానం. అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. ధర్మపురిలో న్యాయస్థానం ( కోర్టు) ఏర్పాటు కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులను, మంత్రులను కలిసి అనేక వినతి పత్రాలు ఇచ్చారు. ధర్మపురి న్యాయస్థానం బార్ కౌన్సిల్ మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే రోజున ధర్మపురిలో కోర్టు ప్రారంభించబడింది. సత్యనారాయణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ధర్మపురి పట్టణంలో విషాదం నెలకొంది పలువురు న్యాయవాదులు ఆయన ఇంటికి చేరుకున్నారు.
బుధవారం గోదావరి తీరంలో దహన సంస్కారాలు జరగనున్నట్లు సమీప బంధువులు తెలిపారు
.