న్యాయవాది సత్యనారాయణ మృతి తీరని లోటు. జడ్జి శ్యాం ప్రసాద్!

J.SURENDER KUMAR

ధర్మపురి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు న్యాయవాది స్వర్గీయ తిరుమందాస్ సత్యనారాయణ అకాల మరణం తీరని లోటు అని ధర్మపురి న్యాయస్థానం జడ్జ్ శ్యాంప్రసాద్ అన్నారు.
మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన న్యాయవాది సత్యనారాయణ సంతాప సమావేశం గురువారం ధర్మపురి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది.

సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ సత్యనారాయణ సేవలను కొనియాడారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యం ప్రసాదించాలని కోరారు
జడ్జి శ్యాం ప్రసాద్, ప్రాసిక్యూటర్ బి.రాజేష్ తదితరులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు,
ఈ సభలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అలుక వినోద్, కార్య నిర్వహణ కార్యదర్శి బందెల రమేష్ . గ్రంథాలయ కార్యదర్శి రామడుగు రాజేష్, న్యాయవాదులు సంబరాజులు కార్తిక్, ఇమ్మడి శ్రీనివాస్, పోలంపెల్లి లక్ష్మణ్, జాజాల రమేష్ , బత్తిని ఇంద్రకరణ్, ఏంపెల్లి ప్రకాష్ , కస్తూరి శరత్, కోర్టు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.