ఒక కోటి 72 లక్షల నిధులతో జిల్లా కేంద్రంలో బాలుగా వసతి గృహం త్వరలో ఏర్పాటు !

జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !


J.SURENDER KUMAR,

జిల్లా కేంద్రం లో ధరూర్ క్యాంప్ ఎస్టీ బాలుర వసతి గృహం లో ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉలెన్ బ్లాంకెట్ లను,నోట్, పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.
ఎమ్మేల్యే మాట్లాడుతూ ..

1 కోటి 72 లక్షలతో జిల్లా కేంద్రం లో బాలుర వసతి గృహం నిదులు మంజూరు చేయటం జరిగింది…
అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ముఖ్యమంత్రి గారి లక్ష్యం.
రాష్ట్రంలో విద్య,ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది.
రాష్ట్రంలో గిరిజనులు,ఆదివాసీల స్వయం పాలన ఉద్దేశం తో తండాలు, గ్రామాలను గ్రామ పంచాయతీ లుగా చేయటం జరిగింది.
రాష్ట్రంలో 91 గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటు..మొత్తం 1 లక్ష 4 వేల గిరిజ న ,ఆదివాసీ బిడ్డలకు ఎంతో ఉపయోగం అని అన్నారు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్య ద్వారా విదేశాల్లో విద్య కోసం స్కాలర్ షిప్ అందిస్తున్నాం..
గిరిజన,ఆదివాసిలకు పోడు పట్టాల పంపిణీ ద్వారా భూమి పై హక్కు కల్పిస్తూ,రైతు బందు,భీమా కల్పించడం జరిగినది. ఎస్టీ హాస్టల్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో వార్డెన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, క్యాంప్ రామాలయం ఛైర్మెన్ నరేష్, కౌన్సిలర్ చాంద్ పాషా, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, వొంటిపులి
రాము, కౌన్సిలర్ లు గుగ్గిల్ల హరీష్, కూతురు రాజేష్, స్టాఫ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.