👉 ముందస్తుగా రుణం డబ్బులు చెల్లించినా. అధికంగా వసూలు చేస్తారా ?.
👉 అధికంగా వసూలు చేసిన డబ్బులు చెల్లించాల్సిందే !
J.SURENDER KUMAR,
గృహ నిర్మాణ, ఇతర అవసరాల నిమిత్తం పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకు నుంచి ఓ వైద్యుడు కోట్లాది రూపాయల రుణం తీసుకున్నాడు. నిబంధనల మేరకు సకాలంలో చెల్లించాల్సిన సమయం, కంటే ముందుగానే అట్టి రుణాన్ని చెల్లించాడు. బ్యాంక్ అధికారులు వైద్యుడు వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు ₹ 3 లక్షలు అధికంగా వసూలు చేశారు. ఇది అన్యాయం అంటూ వైద్యుడు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగి నా పట్టించుకోలేదు. దీంతో వైద్యుడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు, అధికంగా వసూలు చేసిన డబ్బులను వైద్యుడికి వడ్డీతో సహా చెల్లించాలి అంటూ పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ను న్యాయమూర్తి ఆదేశించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ పట్టణానికి చెందిన వైద్యుడు వినిశెట్టి భాస్కర్, హైద రాబాద్ లోని బంజారాహిల్స్ లో గల పంజాబ్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి గృహ రుణంగా దాదాపు కోటి రూపాయలు తీసుకున్నాడు. ₹ 1 లక్ష 34 వేల 395/ చొప్పున ఇట్టి రుణం.120 వాయిదాల ప్రకారం బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. అయితే వైద్యుడు ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుల ను పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకు ముందస్తుగా మొత్తం రుణం పొందిన డబ్బులు చెల్లించాడు.
బ్యాంకు వారు వైద్యుడు వద్ద అధికంగా ₹ 2 లక్షల, 77 వేల,304/- వసూలు చేశారు. దీనిపై బ్యాంకు అధికారులకు వైద్యుడు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికంగా వసూలు చేసిన డబ్బులు చెల్లించలేదు.

దీంతో వైద్యుడు జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా కరీంనగర్ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం ను 2016 లో ఆశ్రయించారు.
ఇరువర్గాల న్యాయవాదుల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి. హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకు వారు అధికంగా వసూలు చేసిన ₹ 2,77,304/- మొత్తము తిరిగి వైద్యుడికి, 9% వడ్డీతో మరియు ఖర్చుల నిమిత్తం అదనంగా మరో ₹ 5000/- చెల్లించాలని న్యాయమూర్తి K. స్వరూప రాణి, సభ్యులు ఎస్ శ్రీలత, వి. నరసింహారావు లు బ్యాంక్ అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.
మరో రుణం నూ ఇదే తరహా ..

ఇదే పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకు నుంచి డాక్టర్ వినిశెట్టి భాస్కర్, ఇతర అవసరాల వినియోగ నిమిత్తం ₹ 2 కోట్ల, 2 లక్షల రుణం తీసుకున్నాడు. 144 వాయిదాలలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంది. అయితే సకాలంలో వాయిదాల కంటే ముందస్తుగా వైద్యుడు చెల్లించినా బ్యాంకు వారు అధికంగా ₹ 83 వేల 024/- వసూలు చేశారు. న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా. వైద్యుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. కేసు పూర్వపరాలు విచారించిన న్యాయస్థానం, పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్ వారికి ₹10,000/- జరిమానా, ₹ 83,024/-(అధికంగా వసూలు చేసిన) డబ్బులకు 9% వడ్డీతో, వైద్యుడికి చెల్లించడంతోపాటు. ఖర్చుల నిమిత్తం ₹ 5000/- చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు అని న్యాయవాది మహేందర్ వివరించారు.