ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరుడుగట్టిన ఆరెస్సెస్, సంఘ ఏజెంట్!

మంత్రి కే తారక రామారావు !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్, సంఘ్ ఏజెంట్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
ఆదివారం ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
మంత్రి కేటీఆర్ మాటల్లో…

రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ అనే విషయం అందరికీ తెలిసిందేనని వీటికి సంబంధించిన పాత వీడియోలు కూడా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుండి నేటి వరకు తెలంగాణకు ద్రోహం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పై రేవంత్ రెడ్డి ఒక్క ఆరోపణ కూడా చేయలేదనీ విభజన చట్టం అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీని పల్లెత్తు మాట అనడం లేదని కేటీఆర్ ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీతో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోసా పెట్టిందని ఏనాడు రైతుల సంక్షేమాన్ని పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను ముంచేందుకు రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ రైతులను కొత్త పాట పాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
మూడు పంటలు కావాలా ? మూడు గంటల కరెంట్ కావాలా ? అని మంత్రి కేటిఆర్ అన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాటలే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోన అని ప్రశ్నించారు. ఐదు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ రైతులను రాచి రంపాన పెట్టిందని, రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెల్వదని, పబ్బులు క్లబ్ లే తెలుసునని రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడరని అన్నారు. 80 వేల కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా ? జరుగుతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి లు సమాధానం చెప్పాలన్నారు. రానున్న పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేస్తామన్నారు. టిఆర్ఎస్ విధానం మూడు పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటల కరెంటా ? అని ఏద్దేవా చేశారు. ఉచిత కరెంటు పై ప్రజా క్షేత్రంలో చర్చకు సిద్ధమని, ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలన, 9 ఏండ్ల సీఎం కేసీఆర్ పాలనపై చర్చించుకుందామన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ జెడ్పి చైర్పర్సన్ దావ వసంత, తదితరులు పాల్గొన్నారు.