పాత పెన్షన్ సాధన సంకల్పయాత్రకు సంపూర్ణ మద్దతు – PRTU -TS జగిత్యాల జిల్లా శాఖ !

J. SURENDER KUMAR.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్న ప్రధాన డిమాండ్తో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించ తలపెట్టిన పాత పెన్షన్ సంకల్ప రథ యాత్రకు మరియు ఆగష్టు 12న నిర్వహించే ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా PRTUTS సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో TSCPSEU సంఘం నిర్వహించ తలపెట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ను శనివారం ఆవిష్కరించిన సందర్భంగా PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు లు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో TSCPSEU అధ్యక్షులు గంగాధరి మహేష్, కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్, PRTUTS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంధి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోవర్ధన్ ప్రసాద్, వూటూరి రాజు, రత్నాకర్ రావు, నాయకులు పరమేశ్వర్, సుదర్శన్,బొమ్మకంటి శ్రీనివాస్, కుమారస్వామి, శ్రీధర్, ఉమేష్, నవీన్, విజయ్, వంశీ, సుధాకర్, దేవేందర్, సతీష్, తిరుపతి, అనిల్, శోభన్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.