J.SURENDER KUMAR
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ వెంకటరమణాచారి కుటుంబానికి జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన ₹16,00,000/- రూపాయల ముడు చెక్కు లను వెంకటరమణాచారి భార్య కు అందజేశారు.
వెంకటరమణాచారి కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారికి పోలీస్ శాఖ పరంగా అనే విధాల సహకరిస్తామని ఎస్పీ అన్నారు.
ధర్మపురి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూకానిస్టేబుల్ 2022 నవంబర్ 17న రోడ్డు ప్రమాద సంఘటనలో మృతిచెందారు.
ఈ కార్యక్రమంలో A.0 అమర్నాథ్ పాల్గొన్నారు.