బడి బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు….
డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. కనీసం మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం పై మంత్రి ఈశ్వర్ పై ఆరోపణ చేశారు.
ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను సందర్శించిన లక్ష్మణ్ కుమార్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్లో సరైన భోజన వసతి లేదని, నీళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారని, బోధన సిబ్బంది కూడా లేక చదువుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్లో విద్యుత్ సరఫరా కూడా సరిగాలేదని కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదని విద్యార్థులు స్వయంగా చెప్తున్నారని, హాస్టల్ కి ఉన్న ప్రహారీ గోడ కూలిపోతే ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న వారే లేరని, ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జిల్లా కలెక్టర్ , అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చెయ్యాలని, సమస్యలను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు..
ధర్మపురి హై స్కూల్లో. నీళ్లు రావడం లేదు !

ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సుమారు నాలుగు వందల మంది ఉన్న ఈ పాఠశాలలో గత 20 రోజులుగా నీళ్లు రావడం లేదని, టాయిలెట్స్ సరిగా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని పాఠశాలలో కనీస నీటి సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
సమీపంలో నీటి ట్యాంకు ఉన్నప్పటికి అట్టి ట్యాంకు నుండి పాఠశాలకు నీరును అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, మన ఊరు మన బడి అని ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కొప్పుల ఈశ్వర్ గొప్పలు చెప్పుకుంటారు తప్ప పాఠశాలలో కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని, పాఠశాల పక్కనే ఉన్న కాలనీకి సంబంధించిన మెయిన్ డ్రైనేజీ ఓపెన్ చేసి ఉండడంతో దాని దుర్వాసన తరగతి గదుల్లోకి వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆరోపించారు. మంత్రి, కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు
లక్ష్మణ్ కుమార్ వెంట ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన భట్ల దినేష్, బ్లాక్ కాంగ్రెస్ 1 అధ్యక్షులు కుంట సుధాకర్, గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, మండల బి. సీ సెల్ అధ్యక్షులు మల్లేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియోద్దిన్, టౌన్ యూత్ అద్యక్షుడు తిరుపతి, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యొరి మహేష్, సీపతి సత్తెన్న, అడ్వకేట్ జాజల రమేష్, రవి, లక్ష్మణ్, సుమక్, స్తంభం కాడి గణేష్,రాజ్ కుమార్, నిరంజన్, ప్రశాంత్, నరేష్, భరత్,దేవవరం తదితరులు ఉన్నారు.