కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా..
J.SURENDER KUMAR.
ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారికి సమగ్ర సమాచారాన్ని అధికార యంత్రాంగం ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి జరిగింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ధరఖస్తుదారుల నుండి వారి సమస్యలకు సంబంధించిన ఆర్జీలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం, తగు చర్య నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు మాత్రమే హాజరు కావాలని, ముందస్తు అనుమతితో అధికారులు సెలవులు పొందాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి దరఖాస్తుదారుని సమస్యను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని అన్నారు. ఇప్పటి వరకు 710 అర్జీలు ప్రజావాణిలో రావడం జరిగిందని, 304 ధరఖస్తులను పరిష్కరించడం జరిగాయని తెలిపారు. మిగతా 388 ధరఖాస్తులు ఆయా శాఖాధికారుల కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 36 దరఖాస్తులు, పలు సమస్యలపై రావడం జరిగిందని, ఆయా శాఖల అధికారులు ఆర్జీలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లు మంజూరు, దళిత బస్తీ, వివిధ శాఖల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ట్రాన్స్ జెండర్ల ప్రతినిధులు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రజావాణిలో పించన్ల మంజూరు, దళిత బస్తీ , భూ సమస్యలు, దివ్యాంగులకు పెన్షన్లు, తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలు రావడం జరిగిందని కలెక్టర్ అన్నారు. అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర్ ఆర్డీఓ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.