ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి !
J.SURENDER KUMAR,
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి క్రింద లబ్దిదారులను ఎంపిక చేయాలని, గృహలక్ష్మి పథకం కింద 3 విడతల్లో లక్ష రూపాయల చొప్పున మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
తెలంగాణకు హరితహారం క్రింద, గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం క్రింద పిట్టింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. బీసి కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం క్రింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, రెండవ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుకు జిల్లా వారిగా ప్రతి నెలా గ్రౌండ్ చేయాల్సిన యూనిట్లపై లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బృందం ఆధ్వర్యంలో గొర్రెల కొనుగొలు చేయాలని అన్నారు.

జిల్లాలకు నూతనంగా మంజూరు చేసిన గ్రామ పంచాయతీ భవనాలు త్వరితగతిన గ్రౌండింగ్ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. గ్రామాలలో నిర్మించిన స్మశానవాటికలో త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తామని, లక్ష్యాలకు అనుగుణంగా పంట సాగుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు మంజూరైన 132 పంచాయతీ భవన నిర్మాణాలను త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.