J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా సమగ్ర శిక్షనలో కాంట్రాక్టు పద్ధతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ లు, సిసిఓ లు, ఐఇఆర్పి లు మరియు ఏపీవో లుగా నూతనంగా ఉద్యోగాలు పొందిన 16 మంది అభ్యర్థులు జగిత్యాల జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు లను గురువారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్టియు సంఘ బాధ్యులు, గత రెండు సంవత్సరాలుగా మా వెన్నంటే ఉంటూ ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం కావడంలో కీలక పాత్ర పోషించడం వల్లనే, సమగ్ర శిక్షన లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందడం జరిగిందని తెలియజేస్తూ, ఇందులో కీలక పాత్ర పోషించిన పి ఆర్ టి యు సంఘ బాధ్యులను సన్మానిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆనంద్ రెడ్డి, ప్రశాంత్, గంగారెడ్డి, సృజన, సుమలత తదితరులు పాల్గొన్నారు