J. SURENDER KUMAR,
జగిత్యాల అర్బన్ మండలంలో శనివారం, ZPHS ధరూర్ క్యాంప్ పాఠశాలలో PRTUTS సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.
PRTUTS జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో, 2023 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఐ.ఆర్ తో కూడిన పిఆర్సిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల చివరి వరకు పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుందని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, మొదటి ఉపాధ్యాయ సంక్షేమ సభ్యత్వం & క్రియాశీల సభ్యత్వంను ధరూర్ క్యాంప్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మామిడాల లక్ష్మీనారాయణ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వూటూరి మహేష్ , జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, పాఠశాల ఉపాధ్యాయులు గంగాధర్, పవన్, పిప్పరి శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.