👉 జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ సంచలన వ్యాఖ్యలు.!
J.SURENDER KUMAR.
వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు.. ఇంకోసారి పోటీ చేయనని ఇవే తనకి చివరి ఎన్నికలు అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం సంచలన వ్యాఖ్యానాలు చేశారు.
2014 లో ఎన్నికల్లో జీవన్ రెడ్డి తనకి చివరి ఎన్నిక అని చెప్పారని, కానీ నేను అలా కాదని మాట తప్పే వ్యక్తిని కాదని అన్నారు.
BRS అధిష్టానం తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని, ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.,
కానీ నేను మరో 5 సం లు రాజకీయాల్లో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని ఉందని, జీవన్ రెడ్డి లా మాట తప్పనని అన్నారు BRS పార్టీ క్రమశిక్షణ గల పార్టీ., వారి మేరకే నేను పని చేస్తానని అన్నారు.
