రాత్రంతా బిక్కు బిక్కు మంటూ ధర్మపురి కస్తూర్బా విద్యార్థినీలు. వర్షంలోనే..

పిల్లలు తీసుకు వెళుతున్న తల్లిదండ్రులు.


J.SURENDER KUMAR.

ధర్మపురి పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ విద్యార్థులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తో బుధవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

వర్షపు నీరు, వరద విద్యాలయ, ప్రాంగణంలోకి రావడంతో వారు నిద్రలేని రాత్రి గడిపారు. విద్యార్థులకు రక్షణగా పాఠశాలలో ఉండాల్సిన కేర్ టేకర్ ( వార్డెన్) అందుబాటులో లేదని సమాచారం. పిఈటి మేడం రాత్రి పాఠశాలలో ఉన్నట్టు సమాచారం.

విద్యాలయంలోకి వర్షపు నీరు చేరిన సమాచారం తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకెళ్లడానికి వర్షంలో పాఠశాలకు తరలి వస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.