మంత్రి కొప్పుల ఈశ్వర్ …
J.SURENDER KUMAR,
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం రేవంత్ కు ఇష్టం లేదు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుంది ఆని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్
రైతుల పై అనుచిత వ్యాఖ్యలుచేసిన చంద్రబాబు కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది..
ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ పెన్షన్ లు పెంచుతామని ఎలా ప్రకటించారు.. అది అవస్తవమా సమాధానం చెప్పాలి..
3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుంది. మళ్ళీ పాతరోజులు వస్తాయి.
ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
బీజేపీ మోటార్లు కు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి.
కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయేవారు.
కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో పాతేయాలి. రైతులు మేల్కొని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి.
రేవంత్ మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి స్పష్టం అయింది..
మూడు గంటల కరెంట్ ఇచ్చే పార్టీకి మూడు సీట్లే. మూడు గంటల కరెంట్ వల్ల ఆత్మహత్యలు పెరుగుతాయి రైతులు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లమనిపించే విధంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు
కాంగ్రెస్ వస్తే..సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారు..
ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది
గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుంది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు.