సమస్యల పరిష్కారంలో చోదక శక్తిగా 475 అసోసియేషన్ !

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ !


J.SURENDER KUMAR,

నూతనంగా క్రమబద్ధీకరించబడ్డ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సమస్యలను పరిష్క రించడంలో 475 అసోసియేషన్ చోదక శక్తిగా పనిచేస్తుందని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ అన్నారు.
జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు
.

కాంట్రాక్ట్ వ్యవస్థ బానిసత్వాన్ని తొలగించడంలో 475 అసోసియేషన్ రెండు దశాబ్దాలకు పైగా అలుపెరుగని పోరాటాలను నిర్వహించిందని అన్నారు. దృఢ సంకల్పంతో కాంట్రాక్టు లెక్చరర్ లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. క్రమబద్దీకరణ కాని మిగిలిన కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు . ప్రభుత్వ ఉన్నత విద్యా వ్యవస్థ పరిరక్షణకు, రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం 475 అసోసియేషన్ రెగ్యులర్ సంఘంగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు . జగిత్యాల జిల్లా అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 475 అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి దేవేందర్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లా శాఖల అధ్యక్షులు ప్రేమ్ సాగర్, సునీల్, రాజేశ్వర్ రెడ్డి, సంఘ రాష్ట్ర నాయకులు పవన్ నాయకులు కొట్టాల తిరుపతిరెడ్డి , అత్తినేని శ్రీనివాస్, యముల శ్రీనివాస్, దమ్మయ్యగారి శ్రీకాంత్, కేశవేణి శ్రీనివాస్, గగడం రచన, వేనేపల్లి సంధ్య, కంకణాల శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, సమీనా, పురాణం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.